Telangana Cabinet Expansion : క్యాబినెట్ విస్తరణ.. ఎవర్ని పదవి వరిస్తుందో..?
Timing Fixed for Telangana Cabinet Expansion : ఖాళీగా ఉన్న 6 పదవులు ఎవరికి దక్కుతాయనేది ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద చర్చగా మారింది.
- Author : Sudheer
Date : 11-09-2024 - 8:52 IST
Published By : Hashtagu Telugu Desk
Timing Fixed for Telangana Cabinet Expansion : తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) అధికారంలోకి వచ్చి పది నెలలు కావొస్తుంది..కానీ ఇంకా చాల మంత్రి పదవులు (Minister Posts) ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆ పదవులపై చాలామందే ఆశగా ఉన్నారు. గత కొద్దీ రోజులుగా పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న..అధిష్టానం ఎవరికీ కట్టపెడుతుందో అనే టెన్షన్ మాత్రమే నేతల్లో ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఖాళీగా ఉన్న 6 పదవులు ఎవరికి దక్కుతాయనేది ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద చర్చగా మారింది.
రేవంత్ (CM Revanth Reddy) బుధవారం ఢిల్లీకి వెళ్తున్నారు. అక్కడ కాంగ్రెస్ హైకమాండ్‌తో మంత్రివర్గ విస్తరణపై రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రాంమోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, షబ్బీర్ అలీ, అజారుద్దీన్ సహా పలువురు మంత్రి పదవి రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరికీ దక్కుతుందో చూడాలి.
బుధువారం హైదరాబాద్ సమీపంలోని తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన సబ్ ఇన్‌స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన పాల్గొని, ట్రైనీ ఎస్సైల నుండి గౌరవ వందనాన్ని సీఎం రేవంత్ స్వీకరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్‌ఐలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. ఈ సన్నివేశం మీకే కాదు.. నాకూ ఓ మధుర జ్ఞాపకం’ అన్నారు. కని పెంచిన తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేలా, యువత సక్రమమైన దారిలో నడవాలని ఆకాంక్షించారు.
Read Also : Prajapalana Dinotsavam : సెప్టెంబర్ 17న ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’