18799 Jobs : బంపర్ ఆఫర్.. మూడింతలు పెరిగిన రైల్వే ఏఎల్పీ జాబ్స్
జాక్‌పాట్ అంటే ఇదే. వాళ్లంతా రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్పీ) జాబ్స్‌కు అప్లై చేశారు.
- By Pasha Published Date - 08:45 AM, Thu - 20 June 24
18799 Jobs : జాక్‌పాట్ అంటే ఇదే. వాళ్లంతా రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్పీ) జాబ్స్‌కు అప్లై చేశారు. అప్లై చేసిన టైంలో కేవలం 5,696 ఏఎల్పీ పోస్టులే ఉన్నాయి. ఇప్పుడు ఈ పోస్టుల సంఖ్యను మూడురెట్లు పెంచారు. దీంతో వాటి సంఖ్య 18,799కి(18799 Jobs) చేరింది. అంతేకాదు ఈ జాబ్స్‌కు అప్లై చేసుకున్న అభ్యర్థుల వయోపరిమితిని కూడా 30 నుంచి 33 ఏళ్లకు పెంచారు. వెరసి ఏఎల్పీ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలామేరకు పెరిగాయి.
We’re now on WhatsApp. Click to Join
ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే.. ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన టైంలో మన సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 585 ఏఎల్పీ పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్స్‌ను మూడురెట్లు పెంచడంతో వాటి సంఖ్య 1949కి చేరింది. ఏదిఏమైనా ఇది చాలా పెద్ద జాబ్ రిక్రూట్మెంట్ ప్రక్రియ. ఇక సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఏఎల్పీ జాబ్స్ సంఖ్య 1192 నుంచి 3973కు పెరిగింది. సెంట్రల్ రైల్వేలో ఏఎల్పీ జాబ్స్ సంఖ్య 535 నుంచి 1786కు పెరిగింది.
Also Read :25 Dead : కల్తీ నాటుసారా తాగి 25 మంది మృతి.. 10 మంది పరిస్థితి విషమం
ఈ ఏడాది జనవరి 20న రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన టైంలో వివిధ రైల్వే జోన్లలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్పీ) పోస్టులు ఉన్నాయి. తాజాగా జూన్ 19న రైల్వేశాఖ చేసిన ప్రకటన ప్రకారం ఆ పోస్టుల సంఖ్య 18,799కి చేరింది. అభ్యర్థులకు జూన్ నుంచి ఆగస్టు మధ్య సీబీటీ-1 పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో అర్హత సాధించే వారికి సెప్టెంబరులో సీబీటీ-2 పరీక్షలు నిర్వహిస్తారు. నవంబరులో ఆప్టిట్యూడ్ టెస్ట్ పరీక్ష జరుగుతుంది. దీని తర్వాత ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. నవంబరు లేదా డిసెంబరులో ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే వారికి రూ.19,900- రూ.63,200 నెలవారీ పే స్కేలును చెల్లిస్తారు.
Also Read : Heat Stroke Cases: దంచికొడుతున్న ఎండలు.. మార్చి- జూన్ మధ్య 40 వేలకు పైగా హీట్‌స్ట్రోక్ కేసులు!
రైల్వే జోన్లవారీగా పోస్టులు ఇలా…
రైల్వే జోన్ | ప్రకటించిన ఖాళీలు | పెరిగిన ఖాళీల సంఖ్య |
సెంట్రల్ రైల్వే | 535 | 1786 |
ఈస్ట్ సెంట్రల్ రైల్వే | 76 | 76 |
ఈస్ట్ కోస్ట్ రైల్వే | 479 | 1595 |
ఈస్టర్న్ రైల్వే | 415 | 1382 |
నార్త్ సెంట్రల్ రైల్వే | 241 | 802 |
నార్త్ ఈస్టర్న్ రైల్వే | 43 | 143 |
నార్త్-ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే | 129 | 428 |
నార్తర్న్ రైల్వే | 150 | 499 |
నార్త్ వెస్టర్న్ రైల్వే | 228 | 761 |
సౌత్ సెంట్రల్ రైల్వే | 585 | 1949 |
సౌత్-ఈస్త్ సెంట్రల్ రైల్వే | 1192 | 3973 |
సౌత్ ఈస్టర్న్ రైల్వే | 300 | 1001 |
సదరన్ రైల్వే | 218 | 726 |
సౌత్ వెస్టర్న్ రైల్వే | 473 | 1576 |
వెస్ట్ సెంట్రల్ రైల్వే | 219 | 729 |
వెస్ట్రర్న్ రైల్వే | 413 | 1376 |
మొత్తం ఖాళీలు | 5,696 | 18,799 |
Related News
500 Employees Layoff : ఆ బ్యాంకు బ్యాడ్ న్యూస్.. 500 మంది ఉద్యోగుల తొలగింపు
ప్రైవేటు బ్యాంకులలో ఉద్యోగుల కోత కొనసాగుతోంది.