HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Gold Seized In India Bangladesh Border

Gold Seized : భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా బంగారం స్వాధీనం

భార‌త్ బంగ్లాదేశ్ బోర్డ‌ర్‌లో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళం బంగారం స్మ‌గ్లింగ్ చేస్తున్న వారిని

  • Author : Prasad Date : 20-09-2023 - 7:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold
Gold

భార‌త్ బంగ్లాదేశ్ బోర్డ‌ర్‌లో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళం బంగారం స్మ‌గ్లింగ్ చేస్తున్న వారిని ప‌ట్టుకుంది.దీని విలువ రూ.14 కోట్లు ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. మొత్తం బంగారం 23 కిలోలుగా గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌లోని పరగణాస్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల ఇంద్రజిత్ ఈ బంగారాన్ని స్మ‌గ్లింగ్ చేస్తున్నాడు.స్మగ్లర్ ఇంద్ర‌జిత్‌ 50 బంగారు బిస్కెట్లు, 16 బంగారు కడ్డీలతో పట్టుబడిన‌ట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. భారీ ఎత్తున బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు బలగాలకు పక్కా సమాచారం అంద‌డంతో స్మ‌గ్ల‌ర్‌పై నిఘా పెట్టారు. సైనికుల స్క్వాడ్ రోడ్డు పక్కన ఆకస్మిక దాడి చేయాల‌ని భ‌ద్ర‌తాద‌ళం ప్లాన్ వేసింది. ఆ రోడ్డులో అనుమానాస్పదంగా ఉన్న మోటార్‌సైకిల్ రైడర్‌ను ఆపి విచారించిన తర్వాత తన మోటార్‌సైకిల్‌ను వదిలి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన భ‌ద్ర‌తాద‌ళం అధికారులు అతడిని పట్టుకున్నారు.మోటార్ సైకిల్ ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఎయిర్ ఫిల్టర్ లో దాచిన బంగారం బయటపడింది. విచారణలో ఇంద్ర‌జిత్‌, అతని సోదరుడు నగల దుకాణాన్ని నడుపుతున్నట్లు వెల్లడించాడు. అతనిని సమీర్ అనే వ్యక్తి సంప్రదించాడ‌ని.. అతను రాంఘాట్ నుండి బంగావ్‌కు బంగారం రవాణా చేయడానికి నెలకు రూ.15,000 ఇచ్చాడ‌ని విచార‌ణ తేలింది. బంగారాన్ని అతని ఇంటి సమీపంలో అతనికి అప్పగించారు, ఆపై రవాణా కోసం తన బైక్‌లోని ఎయిర్ ఫిల్టర్‌లో దాచిన‌ట్లు ఇంద్ర‌జిత్ తెలిపారు. అరెస్టు చేసిన స్మగ్లర్‌, స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తదుపరి చట్టపరమైన చర్యల కోసం బాగ్దాలోని కస్టమ్స్ కార్యాలయానికి అప్పగించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bangladesh border
  • bsf
  • crime
  • gold seized
  • india

Related News

Swedish Pelicot Case

కట్టుకున్న భార్యను 120 మంది పురుషులకు అమ్మేసిన భర్త.

Swedish Pelicot Case స్వీడన్‌లో “స్వీడిష్ పెలికాట్ కేసు”గా సంచలనం సృష్టిస్తున్న లైంగిక దోపిడీ ఉదంతంలో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ హెల్స్ ఏంజెల్స్ గ్యాంగ్ సభ్యుడొకడు ఒక మహిళను అత్యంత కిరాతకంగా శ్రమదోపిడీకి గురిచేసినట్లు అతడిపై తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి. నిందితుడు బాధితురాలి డ్రగ్స్ వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని, ఆమెను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆమె

  • 12 Tonnes Of Kitkats Stolen

    KitKat: 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లతో వెళ్తున్న ట్రక్కు చోరీ..

Latest News

  • Mangos : మార్కెట్‌లో కల్తీ మామిడి పండ్లు..తెలుసుకోవడం ఎలా అంటే !!

  • Hyderabad : పెళ్లి ఎక్కడ జరగదో అనే భయం తో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

  • Gold Price : భారీగా తగ్గిన బంగారం ధర..కొనుగోలు చేసేవారికి ఇదే మంచి ఛాన్స్ !!

  • Telangana: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం, బీర్ల ధరలు

  • Redmi Note 15 : రెడ్‌మీ నోట్ 15 స్పెషల్ ఎడిషన్ లాంచ్

Trending News

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

    • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

    • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

    • అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం.. 2,076 మంది మృతి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd