Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) ఆదివారం భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,040గా నమోదైంది.
- By Gopichand Published Date - 08:30 AM, Sun - 16 April 23
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) ఆదివారం భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,040గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.81,500కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆదివారం (ఏప్రిల్ 16, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,190గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.61,040 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,090గా ఉంది.
Also Read: IGNOU Recruitment: 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ జాబ్స్.. రూ.63,200 వరకూ జీతం
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 78,500 ఉండగా, ముంబైలో రూ.78,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.81,500 ఉండగా, కోల్కతాలో రూ.78,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.81,500 ఉండగా, కేరళలో రూ.81,500గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.81,500 ఉండగా, విజయవాడలో రూ.81,500 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Related News
Silver Price: లక్ష రూపాయలకు చేరువలో కిలో వెండి ధర..?
వెండి తన ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకారం కిలో వెండి రూ.85,700కి చేరింది.