17-gun salute: యుద్ధ వీరుడా.. సెలవికా..!
CDS బిపిన్ రావత్ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ కాంట్‌లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో జరిగాయి. ఢిల్లీలో పూర్తి సైనిక లాంఛనాలతో జరిగాయి. ప్రభుత్వ నాయకులు సైనిక అధికారులు నివాళులర్పించారు.
- By Balu J Published Date - 05:47 PM, Fri - 10 December 21
CDS బిపిన్ రావత్ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ కాంట్‌లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో జరిగాయి. ఢిల్లీలో పూర్తి సైనిక లాంఛనాలతో జరిగాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులు, సైనిక అధికారులు నివాళులర్పించారు. దహన సంస్కారాలను ఆయన కుమార్తెలు కృతిక, తారిణి నిర్వహించారు. 17 ఫిరంగులతో గన్ సెల్యూట్ చేశారు. అంతకుముందు సాయుధ దళాలు అతని సహాయకుడు బ్రిగేడియర్ LS లిడర్‌కు వీడ్కోలు పలికాయి. అంత్యక్రియల నిమిత్తం విస్తృత ఏర్పాట్లు చేశారు. దాదాపు 800 మంది సేవా సిబ్బంది పాల్గొన్నారు. ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తూ, జాతీయ జెండాను ఊపుతూ అంత్యక్రియలు జరిపారు.
#WATCH | Delhi: #CDSGeneralBipinRawat laid to final rest with full military honours, 17-gun salute. His last rites were performed along with his wife Madhulika Rawat, who too lost her life in #TamilNaduChopperCrash.
Their daughters Kritika and Tarini performed their last rites. pic.twitter.com/uTECZlIhI0
— ANI (@ANI) December 10, 2021
అంత్యక్రియలకు శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ నుంచి సీనియర్ సైనిక కమాండర్లు హాజరయ్యారు. US, UK, చైనా, ఫ్రాన్స్, జపాన్, ఇజ్రాయెల్‌తో సహా అనేక దేశాల నుండి సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా నివాళులర్పించేందుకు హాజరయ్యారు. అలాగే సీనియర్ డిఫెన్స్ అధికారులు కూడా ఉన్నారు. డిసెంబరు 8న తమిళనాడులో జరిగిన చాపర్ ప్రమాదంలో రావత్, అతని భార్య, మరో 11 మంది మరణించారు.
Post by the Bhutan Today newspaper pic.twitter.com/jAf1ZM5EJa
— India in Bhutan (@Indiainbhutan) December 10, 2021
Tags
Related News
CDS Anil Chauhan: రెండో సీడీఎస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్!
Anil Chauhan: జనరల్ బిపిన్ రావత్ మరణంతో దాదాపు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవిని రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.