HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # World Cup
  • # Nara Lokesh
  • # Nara Chandrababu Naidu
  • # KCR

  • Telugu News
  • ⁄India
  • ⁄Galwan Valley Clash Hero Col Santosh Babu To Posthumously Receive Mahavir Chakra Today

Galwan : జై జవాన్.. గాల్వాన్ హీరో సంతోష్ బాబుకు మహావీరచక్ర!

‘‘చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్లల్లో బెరుకు ఉండకూడదు. నా మూతిమీద చిరునవ్వు ఉండాలి. నా చెయ్యి నా మీసం మీద ఉండాలి సార్’’.. ఈ డైలాగ్ దివంగత కల్నల్ సంతోష్ బాబుకు అతికినట్టుగా సరిపోతాయి. ప్రాణాలు పోతున్నాయని తెలిసినా.. చావుకు దగ్గరలో ఉన్నా కూడా వెనకడగు వేయని ధీరత్వం ఆయనది.

  • By Balu J Published Date - 03:32 PM, Tue - 23 November 21
  • daily-hunt
Galwan : జై జవాన్.. గాల్వాన్ హీరో సంతోష్ బాబుకు మహావీరచక్ర!

చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు పేరు దేశ వ్యాప్తంగా ఇప్పటికీ మార్మోగుతోంది. దేశ రక్షణ కోసం ఆయన చూపిన తెగువ, ఓ వైపు ప్రాణాలు పోతాయని తెలిసినా.. అక్కడి నుంచి కదలకుండా చూపిన నిబద్ధత గురించి తెలుసుకుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి. చైనా దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన గాల్వన్ హీరో అనగానే సంతోష్ బాబు గుర్తుకువస్తారు. ఆ దాడుల్లో ఆయన చనిపోవడంతో దేశవ్యాప్తంగా ఎంతోమందిని కంటతడి పెట్టించింది. గాల్వాన్ వ్యాలీ హీరో కల్నల్ సంతోష్ బాబుకు మంగళవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండవ అత్యున్నత యుద్ధకాల శౌర్య పతకాన్ని మహావీర చక్ర (మరణానంతరం) ప్రదానం చేశారు. లడఖ్ సెక్టార్‌లోని గాల్వాన్ లోయలో ఆపరేషన్ స్నో లెపార్డ్‌లో శత్రువులను ఎదుర్కొంటూ చైనా ఆర్మీ దాడిని ఎదిరించినందుకు సంతోష్‌బాబుకు శౌర్య పతకాన్ని అందించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ బాబు భార్య, తల్లికి మహావీర్ చక్ర అవార్డును అందుకున్నారు.

” గాల్వాన్ వ్యాలీ (తూర్పు లడఖ్)లో మోహరించిన బీహార్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బికుమల్ల సంతోష్ బాబు శత్రువులను ఎదుర్కొనేందుకు భారత్ బార్డర్ వద్ద ప్రత్యేక దళాలకు బాధ్యత వహించాడు. భారత్-చైనా సరిహద్దు వద్ద శత్రువర్గాలను తిప్పికొట్టాడు. అయితే ప్రత్యర్థులు పదునైన ఆయుధాలతో పాటు భారీ రాళ్ల దాడితో దాడి చేసాడు. కల్నల్ సంతోష్ బాబు ఏమాత్రం భయపడకుండా దాడులకు తిప్పికొట్టారు. శత్రు సైన్యాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. గతేడాది జూన్‌లో గాల్వాన్ లోయలో చైనా సైన్యం జరిపిన దుర్మార్గపు దాడికి వ్యతిరేకంగా నాయబ్ సుబేదార్ నుదురామ్ సోరెన్, హవల్దార్ కె పళని, నాయక్ దీపక్ సింగ్ మరియు సిపాయి గుర్తేజ్ సింగ్‌లతో సహా ఇతర ఆర్మీ సిబ్బంది వారి వీర చక్రాలను (మరణానంతరం) అందుకుంటారు.

చాలా కాలంగా ఇరు పక్షాల మధ్య జరిగిన భీకర ఘర్షణలో భారత్ 20 మంది సైనికులను కోల్పోయింది. చైనీయులు కూడా  భారీ నష్టాలను చవిచూశారు. అయితే ఈ ఘర్షణ తో భారత్ మరింత బలపడింది. చైనా దళాలచే అసాధారణమైన ఆయుధాలను ఉపయోగించిన తర్వాత పెట్రోలింగ్ సమయంలో ఆయుధాలను ఉపయోగించడానికి దళాలకు అనుమతించింది.

Tags  

  • award
  • Galwan
  • santhoshbabu
  • valley
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

M. S. Swaminathan: స్వామినాథన్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

M. S. Swaminathan: స్వామినాథన్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

చెన్నైలోని స్వామినాథన్ భౌతిక ఖాయానికి  రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాళులు అర్పించారు.

  • Allu Arjun’s Award : అల్లు అర్జున్ అవార్డు వెనుక రాజకీయాలు ఉన్నాయా?

    Allu Arjun’s Award : అల్లు అర్జున్ అవార్డు వెనుక రాజకీయాలు ఉన్నాయా?

  • Kashmir Files : కాశ్మీర్ ఫైల్స్ కు జాతీయ సమగ్రతా పురస్కారమా?

    Kashmir Files : కాశ్మీర్ ఫైల్స్ కు జాతీయ సమగ్రతా పురస్కారమా?

  • Singer Mano: సింగర్ మనోకు డాక్టరేట్

    Singer Mano: సింగర్ మనోకు డాక్టరేట్

  • Ram Charan: రామ్ చరణ్ చిత్రానికి ఆస్కార్ విజేత బాణీలు

    Ram Charan: రామ్ చరణ్ చిత్రానికి ఆస్కార్ విజేత బాణీలు

Latest News

  • Nara Bhuvaneswari : భువ‌నేశ్వ‌రి బ‌స్సుయాత్ర‌కు రూట్‌మ్యాప్ సిద్ధం.. ! నిమ్మాకూరు టూ నారావారిప‌ల్లెకి “మేలుకో తెలుగోడా” యాత్ర‌

  • MLA Rajasingh : స్థానికులకే డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలి.. ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

  • Vizag : వైజాగ్‌లో రైల్వే కోచ్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ద‌ర్శ‌న జర్ధోష్‌

  • Indigo : ఇండిగో విమానంలో సిబ్బందితో అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన ప్ర‌యాణికుడు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • LPG Price Hike : అక్టోబర్ 1 షాక్.. ఆ గ్యాస్ సిలిండర్ల ధర భారీగా పెంపు

Trending

    • Raped Dozens Of Dogs : 42 కుక్కలపై రేప్ చేసిన జంతు శాస్త్రవేత్త.. దోషిగా ఖరారు

    • Chandrababu Brand : ఏపీపై భారీ కుట్ర‌? రాష్ట్రానికి సంకెళ్లు.!

    • Ganesh Nimajjanam : వినాయక ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ? గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి ?

    • Weird Politics in AP : జ‌గ‌న్ కోసం MIM, BRS పోటీ?

    • Rs 2000 Note Exchange : 2వేల నోట్ల బదిలీ డెడ్ లైన్ ముంచుకొస్తోంది.. గడువు పొడిగిస్తారా ?

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • World Cup
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • kcr

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version