G20 Summit: జీ20 సదస్సు ఎఫెక్ట్.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలపై కూడా ఆంక్షలు..?!
జీ20 సదస్సు (G20 Summit) సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరగనుంది. ఈ సమ్మిట్‌లో 19 దేశాల బృందం, యూరోపియన్ యూనియన్‌కు చెందిన వ్యక్తులు పాల్గొంటారు.
- Author : Gopichand
Date : 06-09-2023 - 10:56 IST
Published By : Hashtagu Telugu Desk
G20 Summit: జీ20 సదస్సు (G20 Summit) సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరగనుంది. ఈ సమ్మిట్‌లో 19 దేశాల బృందం, యూరోపియన్ యూనియన్‌కు చెందిన వ్యక్తులు పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ వంటి పెద్ద నేతలతో సహా పలువురు ప్రపంచ నేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఇది కాకుండా ఈ సమ్మిట్‌కు 10,000 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
ట్రాఫిక్ వ్యవస్థలు, రైలు, మెట్రో, బస్సులతో సహా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం సలహాలు జారీ చేయబడ్డాయి. వేదిక, అతిథులు బస చేసే హోటళ్ల చుట్టూ సాధారణ ప్రజల రాకపోకలపై ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. మార్గాన్ని కూడా దారి మళ్లించారు. డెలివరీ వ్యక్తులపై కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సెప్టెంబర్ 8,సెప్టెంబర్ 10 వరకు వాణిజ్య డెలివరీ సేవలు ప్రభావితం కానున్నాయి.
ఢిల్లీలోని NDMC ఏరియాలోని కమర్షియల్ డెలివరీ, క్లౌడ్ కిచెన్‌లు సమ్మిట్ సమయంలో 3 రోజుల పాటు మూసివేయబడతాయి. ఈ సమయంలో Swiggy, Zomato, Blinkit, Zepto వంటి క్విక్ సర్వీస్ కంపెనీల డెలివరీ కూడా ప్రభావితమవుతుంది. ఇది కాకుండా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ కంపెనీల డెలివరీని కూడా నిషేధించారు.
Also Read: Famous Temples Of Lord Krishna : శ్రీ కృష్ణుడి ప్రసిద్ధ దేవాలయాల గురించి తెలుసుకుందాం రండి..
అత్యవసర సేవలు తెరిచి ఉంటాయి
విలేకరుల సమావేశంలో స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఎస్‌ఎస్ యాదవ్ మాట్లాడుతూ.. క్లౌడ్ కిచెన్‌లు, ఫుడ్ డెలివరీ సేవలతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇంటర్నెట్ డెలివరీ కంపెనీలను ‘కంటైన్‌మెంట్ జోన్’లలో ఆపరేట్ చేయడానికి మేము అనుమతి ఇవ్వటం లేదన్నారు. అయితే మందులు, ఇతర అవసరమైన వస్తువుల డెలివరీ NDMC ప్రాంతంలో కొనసాగుతాయి అన్నారు.