CRPF : సీఆర్పీఎఫ్ లో పెరుగుతున్న ఆత్మహత్యలు.. రీజన్స్ ఏంటంటే?
కేంద్ర భద్రతా బలగాల్లో ఒకటైనా సీఆర్పీఎఫ్ విభాగంలో జవాన్ల ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళనకరంగా మారింది. ఆత్మహత్యలతో పాటు సహా ఉద్యోగులు ఒకరిని ఒకరు కొట్టుకోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు.
- Author : Balu J
Date : 09-11-2021 - 2:28 IST
Published By : Hashtagu Telugu Desk
కేంద్ర భద్రతా బలగాల్లో ఒకటైనా సీఆర్పీఎఫ్ విభాగంలో జవాన్ల ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళనకరంగా మారింది. ఆత్మహత్యలతో పాటు సహా ఉద్యోగులు ఒకరిని ఒకరు కొట్టుకోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే దీనిని నియంత్రించడానికి సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఛత్తీస్ గఢ్ లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తన సహోద్యోగులను బలిగొన్న దిగ్భ్రాంతి సంఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన తరువాత CRPF సిబ్బంది మధ్య జరిగిన హత్యలు, ఆత్మహత్యల లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. గత ఏడాదితో పొలిస్తే ఈ ఏడాది సీఆర్పీఎఫ్ లో ఎక్కువ మంది జవాన్లు ఆత్మహత్యలకు పాల్పడినట్లు నమోదైయ్యాయి. గత నాలుగేళ్లలో మొత్తం 16 మంది హత్యలు CRPF నుండి నమోదయ్యాయి. ఈ ఏడాది ఐదు కాల్పుల్లో ఆరుగురు జవాన్లు మరణించారు. నవంబర్ 8 నాటికి CRPFలో 48 ఆత్మహత్యలు నమోదయ్యాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం CRPF సిబ్బంది ఆత్మహత్యల సంఖ్య 2016లో 29కి చేరుకుంది. ఈ ఆత్మహత్యల సంఖ్య 2017లో 38, 2018 లో 38, 2019లో 43, 2020లో 60 కి చేరింది.
అయితే జవాన్లు ఆత్మహత్యలకు పాల్పడటంతో సీఆర్పీఎఫ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జవాన్లకు వారంలో నాలుగు సార్లు సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ అధికారులను ఆదేశించారు. దీనికి చౌపల్స్ నామకరణం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా జవాన్లను భయం, ఒత్తిడి నుంచి రిలీఫ్ చేయవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.