Shaktikanta Das : ప్రధాని మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఆర్బీబీ మాజీ గవర్నర్ శక్తికాంతదాస్
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ గా సేవలందించిన శక్తికాంత్ దాస్.. గతేడాది డిసెంబర్ రెండో వారంలో తన పదవికి వీడ్కోలు పలికారు. 2018 నుంచి ఆయన ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నారు.
- By Latha Suma Published Date - 07:26 PM, Sat - 22 February 25

Shaktikanta Das : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఆమోదించింది. ఈ మేరు ప్రధాని మోడీ పదవీకాలంతో సమానంగా లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర నియామకాల క్యాబినెట్ కమిటీ తెలిపింది. అయితే పికె మిశ్రా సెప్టెంబర్ 11, 2019 నుండి ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు.
Read Also: AP Assembly : ఆ భయంతోనే అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ గా సేవలందించిన శక్తికాంత్ దాస్.. గతేడాది డిసెంబర్ రెండో వారంలో తన పదవికి వీడ్కోలు పలికారు. 2018 నుంచి ఆయన ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ హఠాత్తుగా వైదొలిన క్రమంలో ఆ బాధ్యతల్ని శక్తికాంత్ దాస్ చేపట్టారు. 1980 బ్యాచ్ విశ్రాంత ఐఏఎస్ అధికారి శక్తికాంతదాస్ 2018 డిసెంబరు నుంచి ఆరేళ్లపాటు ఆర్బీఐ గవర్నర్‌గా వ్యవహరించారు. అంతక్రితం రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాల విభాగాల్లో కార్యదర్శిగా చేశారు. పదవీ విరమణ అనంతరం 15వ ఆర్థిక కమిషన్ సభ్యుడిగా, జీ20 షెర్పాగా వ్యవహరించారు.
నాలుగు దశాబ్దాలకుపైగా పాలనపరంగా పలు విభాగాల్లో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలులోనూ శక్తికాంతదాస్ కీలక పాత్ర పోషించారు. 2017 జూలై 1 నుంచి పలు ప్రత్యక్ష పన్నులు జీఎస్‌టీలో విలీనం చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. 2021లో ఆర్బీఐ గవర్నర్‌గా ఆయన పదవికాలం ముగియాల్సి ఉండగా మరో మూడేళ్లు పదవీకాలాన్ని పొడిగించారు. అంతేకాదు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం పదవీకాలాన్ని కూడా ఒక ఏడాది పాటు పొడిగించారు. ఆయన పదవీకాలం 2025 ఫిబ్రవరి 25తో ముగియనుంది. తాజాగా జరిపిన పొడిగింపు వల్ల 2026 ఫిబ్రవరి 24 వరకు ఆయన పదవిలో ఉండనున్నారు.
Read Also: Koneru Konappa : కోనేరు కోనప్ప యూటర్న్..చివరి వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతా.. !