Former MLA Arrested: మాజీ ఎమ్మెల్యే అరెస్టు.. ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
కోక్రాఝర్ జిల్లాలోని బాసుమతారి ఇంటి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్న అస్సాం పోలీసులు మాజీ ఎమ్మెల్యే హితేష్ బాసుమతారితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ మేరకు శనివారం పోలీసులు సమాచారం అందించారు. అస్సాంలోని మాజీ ఎమ్మెల్యే హితేష్ బాసుమతారిని పోలీసులు అతడి నివాసంలో అరెస్ట్ (Former MLA Arrested) చేశారు.
- Author : Gopichand
Date : 08-01-2023 - 8:20 IST
Published By : Hashtagu Telugu Desk
కోక్రాఝర్ జిల్లాలోని బాసుమతారి ఇంటి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్న అస్సాం పోలీసులు మాజీ ఎమ్మెల్యే హితేష్ బాసుమతారితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ మేరకు శనివారం పోలీసులు సమాచారం అందించారు. అస్సాంలోని మాజీ ఎమ్మెల్యే హితేష్ బాసుమతారిని పోలీసులు అతడి నివాసంలో అరెస్ట్ (Former MLA Arrested) చేశారు. రాష్ట్రంలో ఓ ఉగ్రవాద సంస్థ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడి నివాసంలో చేసిన సోదాల్లో అధునాతన ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పక్కా సమాచారం అందుకున్న పోలీసులు జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో ఒక ఏకే సిరీస్ రైఫిల్, ఒక ఎం-16 రైఫిల్, 126 రౌండ్ల మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బాసుమతరీ (52) గతంలో బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బిపిఎఫ్) టికెట్‌పై చపగురి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు.
Also Read: Shoots Rapist’s Mother: దారుణ ఘటన.. అత్యాచారం చేశాడని బాలుడి తల్లిపై కాల్పులు
బాసుమతారి.. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కూడా ఉన్నారు. తర్వాత దీనిని బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ (BTR)గా మార్చారు. నిషేధిత తీవ్రవాద సంస్థ బోడో లిబరేషన్ టైగర్స్ (బీఎల్‌టీ)తో అతడికి సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జనవరి 2020లో నిషేధిత నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (NDFB)లోని అన్ని వర్గాలతో సహా కేంద్రం, అస్సాం ప్రభుత్వం, బోడో సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేయడంతో BTRలో తిరుగుబాటు నియంత్రణలోకి వచ్చింది.