HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Email Otp For Sbi Digital Transactions

SBI: డిజిటల్‌ లావాదేవీలకు ఇ-మెయిల్‌ ఓటీపీ: ఎస్‌బీఐ

సైబర్‌ నేరాలను నియంత్రించేందుకు బ్యాంకులు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ఇ-మెయిల్‌ ఓటీపీని ప్రవేశ పెట్టింది.

  • Author : Maheswara Rao Nadella Date : 01-12-2022 - 2:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sbi Otp
Sbi Otp

సైబర్‌ నేరాలను నియంత్రించేందుకు బ్యాంకులు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ఇ-మెయిల్‌ ఓటీపీని ప్రవేశ పెట్టింది. ఖాతాదారులు డిజిటల్‌ లావాదేవీలు చేసినప్పుడు అధీకృత ఇ-మెయిల్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేస్తేనే లావాదేవీ పూర్తవుతుంది. ‘మీ డిజిటల్‌ లావాదేవీలను మరింత సురక్షితంగా నిర్వహించండి. దీనికోసం ఇ-మెయిల్‌ ఓటీపీ నోటిఫికేషన్‌ అందుకునేందుకు, వెంటనే సదుపాయాన్ని యాక్టివేట్‌ చేసుకోండి’ అని ఎస్‌బీఐ ట్విటర్‌లో వెల్లడించింది. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలను వినియోగించే ఖాతాదారులందరూ ప్రొఫైల్‌ విభాగంలో, హైసెక్యూరిటీ అవకాశాల నుంచి ఈ సేవలను యాక్టివేట్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు చెప్పాల్సిందిగా బ్యాంకు నుంచి ఎలాంటి ఫోన్లూ రావని, వినియోగదారులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

పీఎన్‌బీ:

ఏటీఎంలో నుంచి నగదు తీసుకోవాలనుకున్న ప్రతిసారీ ఖాతాకు అనుసంధానంగా ఉన్న మొబైల్‌ నెంబరుకు వచ్చే వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ)ని నమోదు చేయాల్సి ఉంటుందని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) తెలిపింది. ఖాతాదారులు తమ డెబిట్‌ కార్డుతో నగదు తీసుకోవాలంటే.. పిన్‌తో పాటు, ఓటీపీ కూడా నమోదు చేయాల్సిందే. డిసెంబరు 1 నుంచే ఇది అమల్లోకి రానుంది. ఇప్పటికే ఎస్‌బీఐ కూడా తమ ఖాతాదార్లు ఏటీఎం నుంచి రూ.10వేలకు మించి నగదు తీయాలనుకుంటే ఓటీపీ నమోదును తప్పనిసరి చేసింది.

డిజిటల్‌ రుణాలకు కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి:

ఆర్‌బీఐ ఆన్‌లైన్‌లో రుణాలు తీసుకునే ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలు డిసెంబరు 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. వడ్డీ రేట్లను నిర్ణయించడం మొదలు, రుణాల వసూలు విషయంలో రికవరీ ఏజెంట్లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడకుండా చూసే అంశాలు ఇందులో ఉన్నాయి. రుణ మొత్తాన్ని జమ చేసినప్పుడు, వాటిని తిరిగి చెల్లించేటప్పుడు ఖాతాదారుడి ఖాతా, నియంత్రణ పరిధిలోని సంస్థల (బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ) మధ్యే నేరుగా లావాదేవీలు జరగాలి. రుణ సేవలను అందించే సంస్థల (ఎల్‌ఎస్‌పీ) పూల్‌ ఖాతా నుంచి నిర్వహించకూడదని పేర్కొంది. ఎల్‌ఎస్‌పీలకు బ్యాంకులు/ఎన్‌బీఎఫ్‌సీలే రుసుములు చెల్లించాలని, రుణగ్రహీతకు వీటితో సంబంధం లేదని తెలిపింది. ఈ మేరకు ఆగస్టులో ఇచ్చిన మార్గదర్శకాలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Digital Transactions
  • Email
  • india
  • money
  • OTP
  • sbi

Related News

New Currency

New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

భారత కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పులకు భారతీయ రిజర్వు బ్యాంక్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్ల స్థానంలో దశలవారీగా ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే అంశంపై ఆర్‌బీఐ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కరెన్సీ నిర్వహణ ప్రణాళికల్లో భాగంగా ప్లాస్టిక్ నోట్ల అమలుపై ఆర్‌బీఐ దృ

  • Asaduddin Owaisi

    Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Cng Gas

    CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd