Sofiya Qureshi : ‘ఆపరేషన్ సిందూర్’పై వ్యాఖ్యలు.. అలీఖాన్ అరెస్ట్.. విజయ్ షాకు మినహాయింపు
అదే ఆపరేషన్ సిందూర్‌లో భాగమైన కల్నల్ సోఫియా ఖురేషీ(Sofiya Qureshi) గురించి నీచమైన మాటలు మాట్లాడిన మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారు.
- By Pasha Published Date - 09:45 AM, Mon - 19 May 25

Sofiya Qureshi : కల్నల్ సోఫియా ఖురేషీ.. ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన వివరాలను భారత సైన్యం తరఫున ఇటీవలే మీడియాకు వివరించారు. ఇందులో తప్పేముంది ? అయినా కొందరు బీజేపీ నేతలు రెచ్చిపోయారు. ఆమె గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా అయితే మరీ దారుణంగా మాట్లాడారు. ‘‘ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచి వితంతువులను చేశారు. అయితే అదే ఉగ్రవాదుల మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మోడీజీ పాక్‌కు పంపించి గుణపాఠం నేర్పించారు’’ అని కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశించి విజయ్ షా కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు యావత్ దేశ ప్రజలకు బాధ కలిగించాయి. దేశ సైనికులను కూడా మతపరమైన కోణంలో బీజేపీ సీనియర్ నేత విజయ్ షా చూడటాన్ని అందరూ తప్పుపట్టారు.
Also Read :Monica Bedi : మోనికా బేడీకి నకిలీ పాస్‌పోర్ట్.. కృష్ణమోహన్‌రెడ్డి, పీఎస్‌ఆర్ ఆంజనేయులు హయాంలోనే!
అలీఖాన్ అరెస్ట్.. విజయ్ షాకు స్వేచ్ఛ
ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా మాట్లాడాడనే అభియోగంతో హర్యానాలోని సోనీపట్‌లో ఉన్న అశోకా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అలీఖాన్ మహ్మూదాబాద్‌ను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. అదే ఆపరేషన్ సిందూర్‌లో భాగమైన కల్నల్ సోఫియా ఖురేషీ(Sofiya Qureshi) గురించి నీచమైన మాటలు మాట్లాడిన మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎందుకీ తేడా ? ఆయన బీజేపీలో ఉన్నారు.. మంత్రి పదవిలో ఉన్నారని వదిలేశారా ? అనే ప్రశ్నలు ప్రజల మైండ్‌లో ఉదయిస్తున్నాయి. వీటికి బీజేపీ పెద్దలే సమాధానం చెప్పాలి. లేదంటే ఆ పార్టీకి ప్రజల్లో చాలా డ్యామేజ్ జరుగుతుంది. బీజేపీలోని విజయ్ షా లాంటి నేతల నోటిని కంట్రోల్‌లో పెట్టాల్సిన బాధ్యత పార్టీ పెద్దలదే. ఈ అంశంపై ఇటీవలే మధ్యప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేదీ స్పందిస్తూ.. ‘‘కల్నల్ సోఫియా ఖురేషీ గురించి ఇటీవలే కొందరు బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు’’ అని చెప్పారు. అంటే మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి విజయ్‌షాకు బీజేపీతో సంబంధం లేదా ? అలాంటప్పుడు ఆయనను మంత్రి పదవిలో ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు ? పిచ్చిపిచ్చిగా మాట్లాడినా మంత్రి పదవుల్లో కంటిన్యూ చేస్తారా ? అనే దానికి బీజేపీ హైకమాండ్ నుంచి సమాధానం రావాల్సి ఉంది. ఇటీవలే మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జగ్‌దీశ్ దేవ్‌దా కూడా భారత సైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
కంటితుడుపు చర్యకు రెడీ..
ఈ వరుస వివాదాలకు కారకులైన సీనియర్ నేతలపై బీజేపీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కనీసం వారితో క్షమాపణ చెప్పించలేదు. కానీ కంటి తుడుపు చర్యగా మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కొన్ని దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ ఆఫీస్ బేరర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులకు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపర్చుకోవడంపై ట్రైనింగ్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయనుందట. బహిరంగంగా మాట్లాడేటప్పుడు బాధ్యతగా మెలగాలని సూచించనుందట.