Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితదే కీలక పాత్ర – ఈడీ
ఈ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి.. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని ఈడీ స్పష్టం చేసింది
- By Sudheer Published Date - 08:42 PM, Mon - 18 March 24

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో ఈ నెల 15 న ఈడీ అధికారులు కవిత (BRS MLC Kavitha) ను అరెస్ట్ (Arrest) చేసిన సంగతి తెలిసిందే. కవితను రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. కస్టడీలో భాగంగా కవిత ప్రస్తుతం ఈడీ అదుపులో ఉంది. రెండు రోజులుగా ఆమెను విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి ఈడీ (ED) ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join.
ఢిల్లీ, హైదరాబాద్ ,చెన్నై, ముంబైతో పాటు పలు ప్రాంతాలో సోదాలు నిర్వహించామని వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటిఃవరకు 15 మందిని అరెస్ట్ చేశామని, మొత్తం రూ.128.79 కోట్లు సీజ్ చేశామని వెల్లడించింది. మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌తో పాటు పలువురు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారని వివరించింది.
ఈ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి.. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని ఈడీ స్పష్టం చేసింది. ఈ నెల 15వ తేదీన ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు ప్రకటించింది. సోదాల సందర్భంగా కవిత కుటుంబ సభ్యులు ఆటంకం కలిగించారని తెలిపింది. వంద కోట్ల ముడుపుల వ్యవహరంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని పేర్కొంది. ఆప్ నేతలతో కలిసి ఢిల్లీ లిక్కర్ పాలసీని లీక్ చేసి.. అందుకు వారికి వంద కోట్లు చెల్లించారని వెల్లడించింది. ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపుల చెల్లింపులో కవితది కీలక పాత్ర అని ఈడీ పేర్కొంది.
Read Also : Night: పొరపాటున కూడా రాత్రిపూట ఈ పనులు అస్సలు చేయకండి?