Hemant Soren:జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ శాసన సభ్యత్వం రద్దు
జార్ఱండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేశ్ శాసన సభ్యత్వం శుక్రవారం రద్దైపోయింది.
- Author : Hashtag U
Date : 26-08-2022 - 5:49 IST
Published By : Hashtagu Telugu Desk
జార్ఱండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేశ్ శాసన సభ్యత్వం శుక్రవారం రద్దైపోయింది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్ శుక్రవారం సోరేన్ శాసన సభ్యత్వాన్నిరద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల విడుదలతో ఈ క్షణం నుంచే హేమంత్ సోరేన్ సభ్యత్వం రద్దైపోయినట్లే. జార్ఖండ్‌కు సీఎంగా హేమంత్ కొనసాగినా… ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాత్రం ఆయన సభ్యుడిగా కొనసాగలేరు.
తనకు తానుగా గనులను కేటాయించుకున్న హేమంత్ సోరేన్‌పై విమర్శల వెల్లువ కురిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హేమంత్ వ్యవహార సరళిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదును కేంద్రం… ఎన్నికల సంఘానికి పంపడం, హేమంత్ శాసన సభ సభ్యత్వం రద్దుకు ఈసీ సిఫారసు చేయడం, ఈసీ సిఫారసు ఆధారంగా హేమంత్ ఎమ్మెల్యే గిరీని రద్దు చేస్తూ గవర్నర్ నిర్నయం తీసుకోవడం వేగంగా జరిగిపోయింది. ఈ కీలక పరిణామం తర్వాత తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు హేమంత్ సోరేన్ ఎలాంటి అడుగు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Jharkhand CM Hemant Soren today presided over the meeting of the ruling party's ministers and the legislature party at his residence in Ranchi pic.twitter.com/mZfvOp5NYR
— ANI (@ANI) August 26, 2022