Andaman Earthquake : అండమాన్ సముద్రగర్భంలో భూకంపం.. ఏమైందంటే ?
Andaman Earthquake : సోమవారం అర్ధరాత్రి చైనాలో భారీ భూకంపం సంభవించగా.. మంగళవారం తెల్లవారుజామున అండమాన్ సముద్రంలోనూ భూకంపం వచ్చింది.
- By Pasha Published Date - 10:59 AM, Tue - 19 December 23

Andaman Earthquake : సోమవారం అర్ధరాత్రి చైనాలో భారీ భూకంపం సంభవించగా.. మంగళవారం తెల్లవారుజామున అండమాన్ సముద్రంలోనూ భూకంపం వచ్చింది. అండమాన్ సముద్రంలో వచ్చిన భూకంపం తీవ్రత 4.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఈ భూకంపం ప్రభావంతో అండమాన్ సముద్రంలో సునామీ(Andaman Earthquake) ఏర్పడే ముప్పు లేదని అధికారులు తెలిపారు.
Earthquake of Magnitude:4.2, Occurred on 19-12-2023, 03:51:01 IST, Lat: 7.51 & Long: 94.65, Depth: 10 Km ,Location: Andaman Sea, for more information Download the BhooKamp App https://t.co/QQzUuR3nVy @Indiametdept @ndmaindia @KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @moesgoi pic.twitter.com/LzO8FAgJwA
— National Center for Seismology (@NCS_Earthquake) December 18, 2023
We’re now on WhatsApp. Click to Join.
సముద్రాలలో వచ్చే భూకంపాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. సముద్ర తీర ప్రాంతాలకు పెరుగుతున్న రిస్క్‌కు ఈ తరహా భూకంపాలు డేంజర్ సిగ్నల్స్ లాంటివి. ఈనేపథ్యంలో అండమాన్ సముద్ర తీర ప్రాంతాల నివాసితులు, అధికారులకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అలర్ట్ జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భూకంపాల ప్రభావం తక్కువగా ఉన్న వాటి వల్ల కలిగే నష్టాలు, జరిగే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మరోవైపు చైనాలో భూకంపంతో గన్సు (Gansu), కింఘై (Qinghai) ప్రావిన్సులలో 111 మంది చనిపోయారు. 6.2 తీవ్రతతో అక్కడ భూమి కంపించింది. భూకంపం ధాటికి పలు ఇండ్లు నేలమట్టమయ్యాయి. 230 మందికిపైగా గాయపడ్డారు.