HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Do You Know How Much Gold India Has

భారత్‌ వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?

  • Author : Vamsi Chowdary Korata Date : 12-02-2026 - 9:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Top 10 countries with most gold reserves
Top 10 countries with most gold reserves

Gold Reserves  భారత్ సహా ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం బంగారానికి అత్యంత డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది. డాలరుపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఆపదలో ఆదుకుంటుంది. అందుకే భారత్, చైనా సహా పలు ప్రపంచ దేశాలు బంగారం నిల్వల్ని విపరీతంగా పెంచుకుంటున్నాయి. చైనా కేంద్ర బ్యాంకు వరుసగా 15వ నెలా బంగారాన్ని కొనుగోలు చేసింది. మరి ఇప్పుడు ఏ దేశంలో ఎన్ని టన్నుల పసిడి ఉందో తెలుసుకుందాం.

  • వరుసగా 15వ నెలా బంగారాన్ని కొనుగోలు చేసిన చైనా సెంట్రల్ బ్యాంక్
  • మొత్తం 2306 టన్నుల పసిడి నిల్వలతో ప్రపంచంలో ఆరో స్థానం
  • ఆర్బీఐ దగ్గర 880 టన్నుల గోల్డ్ రిజర్వ్స్

అత్యంత విలువైన లోహాల్లో బంగారం ఒకటి. దీనికి ఎక్కడ చూసినా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. బంగారాన్ని అత్యంత వినియోగించే దేశాల్లో చైనా, భారత్ వంటివి ముందు వరుసలో ఉంటాయి. ఇవి ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఇంకా ఎక్కువ బంగారం నిల్వలు ఉన్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. బంగారం అనేది ఎప్పుడూ సురక్షిత పెట్టుబడి సాధనంగా ఉంటుంది. ఆపద సమయంలో.. ఆర్థిక అనిశ్చితి సమయంలో.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది అత్యంత కీలకం. ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడంలో.. ద్రవ్యోల్బణం నుంచి రక్షించేందుకు.. ఇంకా అమెరికా డాలరుపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కూడా రక్షణగా బంగారం నిల్వలు ఉపయోగపడతాయి. ఈ కారణంతోనే ప్రపంచ దేశాలు ఎప్పటికప్పుడు తమ విదేశీ మారకపు పోర్ట్‌ఫోలియోలో భాగంగా భారీగా బంగారాన్ని చేర్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పసిడి ధరలు కూడా భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.

ఇప్పుడు జనవరి నాటికి ప్రపంచ దేశాల్లో.. ఏ దేశంలో బంగారం నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుందాం. ఇది ప్రజల దగ్గర ఉన్న బంగారాన్ని సూచించదు. కేవలం ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల దగ్గర ఉన్న నిల్వల్ని సూచిస్తుందని తెలుసుకోవాలి. ఇక చైనా సెంట్రల్ బ్యాంకు వరుసగా 15వ నెల కూడా పసిడిని కొనుగోలు చేసి నిల్వల్ని పెంచుకుంది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBOC) రిపోర్ట్ ప్రకారం.. జనవరిలో కూడా చైనా గోల్డ్ రిజర్వ్స్ పెరిగాయి. అక్కడ 71.15 మిలియన్ ఫైన్ ట్రాయ్ ఔన్సుల నుంచి 74.19 మిలియన్ ఫైన్ ట్రాయ్ ఔన్సులకు పెంచుకుంది. ఇక్కడ చూస్తే దాదాపు దీని విలువ 369.58 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని PBOC పేర్కొంది. ఇది భారత కరెన్సీలో చూస్తే సుమారు రూ. 33 లక్షల కోట్లుగా ఉంటుంది.

చైనా బంగారం నిల్వలు టన్నుల్లో చూస్తే గనుక 2306 టన్నులుగా ఉంది. నెలలో సుమారు 2 టన్నులకుపైగా కొనుగోలు చేసింది. అంటే 2 వేల కిలోల బంగారం కొన్నదన్నమాట. టన్ను అంటే 1000 కిలోలు అన్న సంగతి తెలిసిందే. అంటే మొత్తంగా చైనా దగ్గర 23 లక్షల కిలోలకుపైగా బంగారం నిల్వలు ఉన్నాయి. భారత్ కూడా కొంత కాలంగా బంగారం నిల్వల్ని భారీగా పెంచుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దగ్గర 880.18 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. అంటే 8,80,180 కిలోల పసిడి ఉంది. ప్రస్తుతం బంగారం ధర గ్రాముకు రూ. 15,960 గా ఉండగా.. కిలోకు రూ. 1,59,60,000 గా ఉంటుంది. ఈ లెక్కన ఈ పసిడి నిల్వల విలువ రూ. 14 లక్షల కోట్లకుపైనే ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికాలో బంగారం నిల్వలు అన్నింటికంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 8133 టన్నుల బంగారం ఉంది. టాప్-10 లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

  1. అమెరికా – 8133 టన్నులు
  2. జర్మనీ – 3350 టన్నులు
  3. ఇటలీ – 2452 టన్నులు
  4. ఫ్రాన్స్ – 2437 టన్నులు
  5. రష్యా – 2,327 టన్నులు
  6. చైనా – 2,306 టన్నులు
  7. స్విట్జర్లాండ్ – 1040 టన్నులు
  8. ఇండియా – 880 టన్నులు
  9. జపాన్ – 846 టన్నులు
  10. టర్కీ – 614 టన్నులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 24 karat gold
  • Gold Reserves
  • Gold Reserves in India
  • India’s Gold Reserves Cross Rs8.5 Lakh Crore
  • RBI Gold Reserves
  • Top 10 countries

Related News

Gold Rate Today Feb3

వారంలో భారీగా తగ్గిన పసిడి ధరలు

వారం వ్యవధిలో ఇది ఏకంగా రూ. 3,650 మేర తగ్గి, ప్రస్తుతం రూ. 1,43,550కి చేరుకుంది. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్‌లో ధరలు పెరుగుతాయని ఆశించిన వినియోగదారులకు, ఈ వరుస పతనం పెద్ద శుభవార్తగా మారింది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలకు బ్రేక్ పడటంతో,

    Latest News

    • హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోతున్న రౌడీ గ్యాంగ్

    • ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కొలంబోలో పిచ్‌ను ఎప్పుడైనా మార్చొచ్చు: పాక్‌ మాజీ క్రికెటర్‌

    • సిరిసిల్లలో ఓటర్లకు నకిలీ బంగారు కాయిన్స్ పంపిణీ

    • జాహ్నవి కందుల కుటుంబానికి 264 కోట్ల పరిహారం

    • Whatsapp Black : రష్యాలో వాట్సాప్ బ్లాక్!

    Trending News

      • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

      • ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే!

      • ఏప్రిల్ 1 నుండి మారనున్న ప్ర‌త్యేక‌ నిబంధనలు ఇవే!

      • రైల్వే ప్ర‌యాణికుల‌కు మ‌రో అదిరిపోయే సూప‌ర్ న్యూస్‌!

      • అర్జున్ టెండూల్క‌ర్‌ పెళ్లికి ప్ర‌ధాని మోదీ?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd