HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Demand For Himalayan Viagra People Are Losing Their Lives

Himalayan Viagra: హిమాలయన్ వయాగ్రాకు డిమాండ్.. ప్రాణాలు పోగొట్టుకుంటున్న జనాలు!

విలువైన మూలికల కోసం ఎంతోమంది అడవులకు (Forest) వెళ్లి గాలించిన సందర్భాలున్నాయి.

  • Author : Balu J Date : 04-05-2023 - 12:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Viagra
Viagra

కొన్ని వనమూలికలకు ఇప్పటికీ డిమాండ్ ఉంది. విలువైన మూలికల కోసం ఎంతోమంది అడవులకు (Forest) వెళ్లి గాలించిన సందర్భాలున్నాయి. నపుంసకత్వం, అంగస్తంభన సమస్యలను దూరంచేసే ఔషధాలకు డిమాండ్ ఉండటంతో జనాలు ఎగబడుతున్నారు. కొందరు వీటి కోసం ప్రాణాలు సైతం పొగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హిమాలయన్ (Himalayan) వయాగ్రాగా పిలిచే అత్యంత విలువైన మూలిక కోసం వెళ్లినవారు గల్లంతైన ఘటన నేపాల్ లో చోటు చేసుకుంది. హిమాలయన్ వయాగ్రా లేదా యార్సగుంబా కోసం వెళ్లిన ఐదుగురు వ్యక్తులు పశ్చిమ దార్చులా జిల్లాలో హిమపాతంలో సమాధి అయ్యారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో హిమాలయన్ వయాగ్రా మరోసారి చర్చకు వచ్చింది.

ఎందుకంత డిమాండ్

ఇదో రకం శిలీంధ్రం. హిమాలయాల్లో మాత్రమే దొరికే అరుదైన మూలిక ఇది. అనేక ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షిస్తుందని, లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతుందని నమ్ముతారు. పేరుకే హిమాలయన్ వయాగ్రా (Viagra) అయినా ఇది అంతకు మించి..! లైంగిక సామర్ధ్యాన్ని పెంచడంలో దీన్ని మించినది లేదంటారు. ఇప్పుడు మార్కెట్‌లో దొరికే వయాగ్రాలేవీ దీని ముందు పనికిరావు. ఇది సహజసిద్ధమైనది. వెయ్యేళ్ల క్రితమే దీన్ని లైంగిక పటుత్వ చికిత్సల్లో వాడినట్లు చెబుతారు. అందుకే దీనికి అంత డిమాండ్. వీటిని మందుల తయారీకి ఉపయోగిస్తుంటారు. కొంతమంది దీన్ని నేరుగా టీ, సూపుల్లో కలుపుకుని కూడా తాగుతుంటారు. భారత్‌లో దొరికే రకంతో పోల్చితే నేపాలీ రకానికి డిమాండ్ ఎక్కువ. కఠినమైన చలిగాలులు, మంచును (Snow) తట్టుకుని ఈ మూలికను అన్వేషిస్తారు. కొన్ని కుటుంబాలు దీనిపై ఏటా రూ.5-6లక్షలు సంపాదిస్తున్నాయి.

నలుగురు గల్లంతు

‘మిస్ అయిన వారిలో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వాతావరణ పరిస్థితి కూడా బాగా లేదు’ అని డిప్యూటీ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ప్రదీప్ సింగ్ ధామి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) బోలిన్‌లోని బయాన్స్ విలేజ్ కౌన్సిల్- 01 వద్ద భారీ హిమపాతం సంభవించిందని ఓ అధికారి తెలిపారు. యార్సగుంబా మూలిక అన్వేషణలో భాగంగా అక్కడ టెంట్లు వేసుకున్న 12 మంది ఆ మంచు తుపానులో గల్లంతయ్యారని (Missing), వెంటనే స్పందించిన స్థానికులు భద్రతా దళాలకు సమాచారం ఇచ్చారని అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది కొందరిని కాపాడిందని, ఐదుగురి ఆచూకీ దొరకలేదని చెప్పారు. వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: Salman Farmhouse: భూతల స్వర్గం సల్మాన్ ఖాన్ ‘ఫామ్ హౌస్’.. ప్రత్యేకతలివే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Himalayan Viagra
  • himalayas
  • Nepal
  • unknown facts

Related News

T20 World Cup 2026

టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

గ్రూప్-Aలోనే ఉన్న మరో జట్టు నెదర్లాండ్స్ కూడా ప్రమాదంలో ఉంది. వారి తదుపరి మ్యాచ్ వరుస విజయాలతో జోరు మీదున్న బలమైన భారత జట్టుతో జరగనుంది.

    Latest News

    • పదేపదే ఆకలి అవుతుందా? అయితే కార‌ణాలివే!!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    Trending News

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd