Head Constable: ఢిల్లీ హెడ్ కానిస్టేబుల్ కు సివిల్స్ ర్యాంక్.. ఎనిమిదో ప్రయత్నంలో విజయం..!
ఢిల్లీలో హెడ్ కానిస్టేబుల్ (Head Constable)గా పని చేస్తున్న రామ్ భజన్ కుమార్ సత్తా చాటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మంగళవారం విడుదల చేసిన ఫలితాల జాబితాలో ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రామ్ భజన్ కుమార్
- Author : Gopichand
Date : 24-05-2023 - 8:54 IST
Published By : Hashtagu Telugu Desk
Head Constable: ఢిల్లీలో హెడ్ కానిస్టేబుల్ (Head Constable)గా పని చేస్తున్న రామ్ భజన్ కుమార్ సత్తా చాటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మంగళవారం విడుదల చేసిన ఫలితాల జాబితాలో ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రామ్ భజన్ కుమార్ (34) తన ఎనిమిదో ప్రయత్నంలో 667వ ర్యాంక్ సాధించాడు. సైబర్ సెల్ పోలీస్ స్టేషన్‌లో పోస్ట్ చేయబడిన కుమార్ పరీక్షలో ఉత్తీర్ణులైన 933 మంది అభ్యర్థులలో ఒకరు. ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రామ్ భజన్ కుమార్ మాట్లాడుతూ.. నాకు ఇది ఒక కల. నిజమైంది. ఇది నా ఎనిమిదో ప్రయత్నం. నేను OBC వర్గానికి చెందినవాడిని కాబట్టి నేను తొమ్మిది ప్రయత్నాలకు అర్హత పొందాను. నాకు చివరి అవకాశం మిగిలింది. ఈసారి సక్సెస్ కాకపోతే నెక్స్ట్ అటెంప్ట్ కి ప్రిపేర్ అయ్యేవాడిని అని తెలిపాడు.
రామ్ భజన్ ఇంకా మాట్లాడుతూ.. వాస్తవానికి నా ర్యాంకు మెరుగుపరచడానికి నేను మే 28 న జరిగే ప్రిలిమినరీ పరీక్షకు మళ్లీ హాజరవుతున్నాను. రామ్ తన మునుపటి ప్రయత్నం తర్వాత మళ్లీ పరీక్షకు సిద్ధమయ్యాడు. నేను మరింత మెరుగ్గా రాణించగలననే సానుకూల ఆలోచనతో పరీక్షకు సిద్ధమవుతున్నానని చెప్పాడు. నేను రాజస్థాన్‌లోని ఒక గ్రామం నుండి వచ్చాను. నాన్న కూలీ. మాకు చదువు చెప్పించడానికి మా రోజువారీ అవసరాలు తీర్చడానికి మా కుటుంబం ఎంత కష్టపడిందో నేను చూశాను. అప్పుడు కూడా మేము ఆశ కోల్పోలేదు. అవకాశం వచ్చినప్పుడు నా బెస్ట్ ఇద్దామని అనుకున్నాను అన్నారు.
Also Read: Man From 2047 : 2047 నుంచి వచ్చి..తనను తాను కలిసి..
పరీక్ష ఫలితాలు వెలువడిన వెంటనే కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, సీనియర్ అధికారుల నుంచి అభినందనలు అందాయి అని రామ్ భజన్ కుమార్ తెలిపారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను కోరుకున్నది నాకు లభించింది అని ఆయన తెలిపారు. తన భార్య ప్రోద్బలంతోనే సక్సెస్ అయినట్లు తెలిపారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2022లో మొత్తం 933 మంది అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో 613 మంది పురుషులు, 320 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.