Delhi Election Results 2025 : 17 నియోజకవర్గాల చేతిలో ‘ఢిల్లీ పీఠం’
Delhi Election Results 2025 : ముఖ్యంగా బీజేపీ (BJP) 12 సీట్లలో, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 5 సీట్లలో 1000 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నాయి
- By Sudheer Published Date - 10:56 AM, Sat - 8 February 25

2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో విజేత(Delhi Election Winner) ఎవరు అనేది ఇప్పుడు 17 కీలక నియోజకవర్గాలపై ఆధారపడి ఉంది. ఈ నియోజకవర్గాల్లో మార్జిన్ అత్యంత తక్కువగా ఉండటంతో పోటీ హోరాహోరీగా సాగుతోంది. ముఖ్యంగా బీజేపీ (BJP) 12 సీట్లలో, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 5 సీట్లలో 1000 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నాయి. ఓటింగ్ చివరి దశలో ఏ పార్టీకి ఓటర్లు మద్దతు పెంచినా ఫలితాల్లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
Delhi Election Results 2025 : ముస్లింల ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం..కారణం ఇదే..!!
ఈ 17 నియోజకవర్గాల్లో పోటీ ఉత్కంఠగా మారటానికి ప్రధాన కారణం.. ఇటీవలి ఎన్నికల ప్రచారం. బీజేపీ తన నూతన వ్యూహాలతో ముందుకు సాగగా, ఆప్ కూడా తన అభ్యర్థుల గెలుపుకోసం ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసింది. ముస్లిం ఓటర్లు, యువత, మధ్యతరగతి వర్గం మద్దతు ఎవరి వైపుకు ఎక్కువగా ఉంటుందో, ఆ పార్టీకి విజయావకాశాలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ముఖ్యమైన నేతలు కూడా చాలా తక్కువ ఓట్ల తేడాతో ముందంజలో ఉండటం గమనార్హం. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, విద్యా శాఖ మంత్రి ఆతిశీ మార్లేనా ఇద్దరూ కేవలం 1000 ఓట్ల తేడాతోనే ఉన్నారు. ఇది చివరి క్షణాల్లో ఏదైనా మార్పు చోటుచేసుకుంటే రాజకీయ సమీకరణాలు మారిపోవచ్చని స్పష్టంగా తెలుస్తుంది.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఒక్క రౌండ్‌లోనే విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటే, గెలుపు ఎవరి వైపునకు వెళ్తుందనే అంశంపై తుది నిర్ణయం అప్పుడే స్పష్టతకు వస్తుంది. కొన్ని చోట్ల పోటీ అంతరాన్ని బట్టి రీకౌంటింగ్ అవకాశాలు కూడా ఉన్నాయని ఎన్నికల పరిశీలకులు చెబుతున్నారు. బీజేపీ ఆధిక్యంలో నిలిచి తన పాలనను మరింత విస్తరించుకుంటుందా? లేక ఆప్ తిరిగి తన అధికారం కాపాడుకుంటుందా? అనేది మరో కొద్ది గంటల్లోనే తేలనుంది.