Delhi Election Schedule : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఎప్పుడంటే..!!
Delhi Election Schedule : మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి
- By Sudheer Published Date - 03:23 PM, Tue - 7 January 25

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రకటించింది. ఫిబ్రవరి 23న ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగుస్తుండటంతో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. జనవరి 10న నోటిఫికేషన్ విడుదలవుతుందని, జనవరి 17 వరకు నామినేషన్లు స్వీకరించబడతాయని ఎన్నికల కమిషన్ తెలిపింది.
‘Jana Nayakudu’ : ‘జన నాయకుడు’ కేంద్రాన్ని ప్రారంభించిన చంద్రబాబు
ఫిబ్రవరి 5న పోలింగ్, ఫిబ్రవరి 8న ఫలితాలు
ఢిల్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. నామినేషన్ ఉపసంహరణకు జనవరి 20 వరకు గడువు ఉంది. ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించబడతాయని తెలిపింది.
ఈవీఎంలపై అనుమానాలు, ఎన్నికల కమిషన్ వివరణ
ఈవీఎంలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో, ఈవీఎంల రిగ్గింగ్ జరగదని, ట్యాంపరింగ్‌కు అవకాశం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గతంలోనూ ఈవీఎంలు సురక్షితంగా ఉండటం ప్రూవ్ అయ్యిందని, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
ఓటర్ల వివరాలు, మహిళా ఓటర్ల పెరుగుదల
దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లకు చేరిందని, మహిళా ఓటర్లు 48 కోట్లకు పెరిగారని సీఈసీ తెలిపారు. ఢిల్లీలో అన్ని ప్రాంతాల నుంచి ఓటర్లు ఉంటారని, పారదర్శక ఎన్నికల కోసం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఇక తన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హోదాలో ఇదే చివరి ప్రెస్ మీట్ అని రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటింగ్ శాతం, ప్రక్రియపై పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. పోలింగ్ రోజున సాయంత్రం 6 గంటల సమయానికి కచ్చితమైన వివరాలు చెప్పడం సాధ్యం కాదని తెలిపారు.