Delhi Bomb Blast : ఢిల్లీ పేలుడు.. కీలక సూత్రధారి ఈమే..!
Delhi Bomb Blast : ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తాజాగా ఈ కేసులో అరెస్టైన ఉత్తరప్రదేశ్ మహిళ డాక్టర్ షాహీన్ ఫొటో వెలుగులోకి రావడంతో కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి
- Author : Sudheer
Date : 11-11-2025 - 3:20 IST
Published By : Hashtagu Telugu Desk
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తాజాగా ఈ కేసులో అరెస్టైన ఉత్తరప్రదేశ్ మహిళ డాక్టర్ షాహీన్ ఫొటో వెలుగులోకి రావడంతో కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, షాహీన్ అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందించినట్లు తేలింది. ఆమె ఆధ్వర్యంలో భారీ నిధులు వసూలు చేసి, వాటిని దాడుల ప్రణాళికలకు వినియోగించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
Grain Purchases : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి – ఉత్తమ్ కుమార్
విచారణలో షాహీన్ పాత్ర మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న జైషే మహ్మద్ సంస్థకు మహిళా సభ్యులను నియమించడం, వారి శిక్షణా కార్యక్రమాలను పర్యవేక్షించడం ఆమె బాధ్యతగా ఉన్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. సోషల్ మీడియా ద్వారా ఆమె యువతను ఆకర్షించి, మతపరమైన భావజాలం పేరిట ఉగ్రవాద సిద్ధాంతాలకు మద్దతు ఇవ్వడానికి ప్రేరేపించినట్లు సమాచారం. దర్యాప్తు అధికారులు షాహీన్ కమ్యూనికేషన్ డివైజ్‌లను సీజ్ చేసి, ఆమె విదేశీ నెట్‌వర్క్‌లతో సంబంధాలపై కూడా దృష్టి సారించారు.
అటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కి బదిలీ చేసే అవకాశాలపై పరిశీలిస్తోంది. ఎర్రకోట పేలుడు వెనుక ఉన్న ఆర్గనైజేషన్, ఫండింగ్ నెట్‌వర్క్, అంతర్జాతీయ లింకులపై లోతైన విచారణ కొనసాగుతోంది. అధికారులు షాహీన్ ద్వారా మరిన్ని కీలక వ్యక్తుల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దేశ భద్రతకు సంబంధించిన ఈ ఘటనను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటుండగా, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.