Two Flights Clash Averted : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో హైటెన్షన్.. కాసేపైతే ఆ రెండు విమానాలు.. ?
Two Flights Clash Averted : ఢిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఒకే సమయానికి ల్యాండింగ్, టేకాఫ్ అయ్యేందుకు రన్‌వేపైకి రాబోయాయి.
- By Pasha Published Date - 03:46 PM, Wed - 23 August 23

Two Flights Clash Averted : ఢిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఒకే సమయానికి ల్యాండింగ్, టేకాఫ్ అయ్యేందుకు రన్‌వేపైకి రాబోయాయి. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు సమయ స్ఫూర్తితో వ్యవహరించి పెను ప్రమాదం జరగకుండా ఆపారు. ఈ రెండు విమానాలు కూడా విస్తారా విమానయాన సంస్థకు చెందినవే. బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి బాగ్‌డోగ్రా వెళుతున్న యూకే725 విమానం టేకాఫ్ అయ్యేందుకు రన్‌వేపైకి వచ్చింది. అదే సమయంలో అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానానికి ఏటీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also read : Chandrayaan-3 Landing : ఆ 20 నిమిషాలు చంద్రయాన్ -3 `ఉత్కంఠ క్షణాలు`
దీంతో ఆ విమానం కాసేపు అయితే అదే రన్ వే పైకి ల్యాండ్ కావాల్సి ఉంది. ఈవిషయాన్ని గుర్తించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు .. అప్పటికే ఆ రన్ వేపై ఉన్న ఢిల్లీ-బాగ్‌డోగ్రా విమానాన్ని పార్కింగ్ ప్లేస్ కు పంపించారు. ఆ తర్వాత అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చిన విస్తారా విమానం సేఫ్ గా (Two Flights Clash Averted) అక్కడ ల్యాండ్ అయింది. దీంతో ఏటీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా ఒక రన్‌వేపై విమానం టేకాఫ్ అవుతుంటే.. పక్కనే ఉన్న మరో రన్‌వేపై కూడా విమానం ల్యాండింగ్‌కు అనుమతించరు.