Credit Card Users : ఇక మీకు నచ్చిన నెట్‌వర్క్‌లో క్రెడిట్ కార్డు.. ఎలా ?
Credit Card Users : క్రెడిట్ కార్డుల జారీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది.
- Author : Pasha
Date : 06-03-2024 - 2:56 IST
Published By : Hashtagu Telugu Desk
Credit Card Users : క్రెడిట్ కార్డుల జారీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం.. క్రెడిట్ కార్డులను ఎంపిక చేసుకునే విషయంలో వినియోగదారులకు మరిన్ని అదనపు ఆప్షన్స్ అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతానికి బ్యాంకులు తమతో ఒప్పందం ఉన్న బ్యాంకింగేతర సంస్థలతో కలిసి క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఇకపై తమకు ఏ నెట్‌వర్క్ కార్డు కావాలి అనేది వినియోగదారుడే బ్యాంకుకు సూచిస్తాడు. ప్రస్తుతం ఏ రకం క్రెడిట్ కార్డును వినియోగదారులకు ఇవ్వాలనేది బ్యాంకులే డిసైడ్ చేస్తున్నాయి. వాటితో ఒప్పందాలున్న నెట్‌వర్క్‌లకు చెందిన క్రెడిట్ కార్డులను(Credit Card Users) మాత్రమే ఇష్యూ చేస్తున్నాయి. ఇకపై ఈవిధమైన వన్ సైడ్ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ బ్యాంకులకు ఉండబోదు.
We’re now on WhatsApp. Click to Join
ఈ తరహాలో క్రెడిట్ కార్డుల జారీలో బ్యాంకులు తీసుకునే వన్ సైడ్ నిర్ణయాలపై ఇటీవల ఆర్‌బీఐ రివ్యూ చేసింది. క్రెడిట్ కార్డుల జారీ సంస్థలు, క్రెడిట్ కార్డు నెట్‌వర్క్‌ల మధ్య ఉన్న ఒప్పందాల వల్ల కార్డు ఎంపికలో వినియోగదారులకు ఆప్షన్లు లేకుండాపోతున్నాయని ఈ రివ్యూలో వెల్లడైంది. ఈ పరిస్థితిని మార్చేందుకుగానూ ‘పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం – 2007’ కింద తనకున్న అధికారాలను వినియోగించి ఆర్బీఐ తాజా గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది.ఇతర క్రెడిట్ కార్డు నెట్‌వర్క్‌ల సేవలను పొందకుండా పరిమితులు విధించే నిరంకుశ క్రెడిట్ కార్డు నెట్‌వర్క్‌లతో బ్యాంకులు ఇకపై ఒప్పందాలు కుదుర్చుకోవద్దని ఆర్బీఐ నూతన గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేసింది.
Also Read :EVs Dangerous : ఈవీలతోనే ఎక్కువ కాలుష్యం.. సంచలన రిపోర్టులో కీలక విషయాలు
ఇప్పటికే క్రెడిట్ కార్డు ఉన్నవారికి రెన్యూవల్ చేసుకునే సమయంలో నచ్చిన నెట్‌వర్క్‌కు మారే అవకాశాన్ని కూడా బ్యాంకులు ఇకపై కల్పించాల్సి ఉంటుంది. 10 లక్షలలోపు యాక్టివ్ కార్డులున్న బ్యాంకులకు ఈ నిబంధనలు వర్తించవని ఆర్బీఐ స్పష్టం చేసింది. సొంత నెట్‌వర్క్ ద్వారా కార్డు జారీ చేస్తున్న సంస్థలకు మినహాయింపు ఇచ్చింది. ఈ మార్గదర్శకాలను 2024 మార్చి 6 నుంచి ఆరు నెలల్లోగా అమలు చేయాలని తెలిపింది. అనుమతి ఉన్న కార్డు నెట్‌వర్క్‌ల జాబితాను ఆర్‌బీఐ తన మార్గదర్శకాల్లో ప్రస్తావించింది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, మాస్టర్ కార్డ్ ఏషియా/పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-రూపే, వీసా వరల్డ్‌వైడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ జాబితాలో ఉన్నాయి.