Mizoram Update : మిజోరంలో ZPM స్వీప్.. బీజేపీ, కాంగ్రెస్ ఇలా..
Mizoram Update : మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
- By Pasha Published Date - 10:02 AM, Mon - 4 December 23

Mizoram Update : మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం 13 కేంద్రాల్లో ఓట్ల కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. తాజాగా అప్‌డేట్స్ ప్రకారం ప్రతిపక్ష పార్టీ జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) ముందంజలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 40 స్థానాలు ఉండగా.. ZPM పార్టీ అభ్యర్థులు 24 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) పార్టీ కేవలం 11 స్థానాల్లో లీడ్‌లో ఉంది. బీజేపీ మూడు స్థానాల్లో, కాంగ్రెస్ 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఇప్పటికే పూర్తైంది. ఇప్పుడు ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఎన్నికల విధుల్లో మొత్తం నాలుగు వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మిజోరంలో త్రిముఖ పోరు నెలకొంది. మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), కాంగ్రెస్, జోరం పీపుల్స్ మూమెంట్ (ZPM) మధ్యే ప్రధాన పోటీ ఉంది. బీజేపీ సైతం పోటీలో ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎంఎన్‌ఎఫ్‌కు, జడ్‌పీఎంకు మధ్య గట్టిపోటీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజపా ప్రభావం నామమాత్రమే. కాంగ్రెస్ కొన్నిసీట్లలో ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఒకటీ, రెండు స్థానాలు రావడం కూడా కష్టమే.