Cheetahs died: కునో పార్కులో ఏం జరుగుతుంది? మరో రెండు చీతాలు మృతి
భారతదేశంలో చీతాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతా ద్వారా నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి 20 చీతాలను విడుదల వారిగా తీసుకొచ్చిన విషయం విధితమే.
- By News Desk Published Date - 08:30 PM, Thu - 25 May 23

మధ్యప్రదేశ్(Madhyapradesh) లోని కునో నేషనల్ పార్కు(Kuno National Park)లో చీతాల మరణాలు ఆగడం లేదు. నమీబియా, దక్షిణాఫ్రికా(South Africa) నుంచి తీసుకొచ్చిన చీతాలు ఇప్పటికే మూడు మరణించిన విషయం విధితమే. అనారోగ్యం కారణంగా అవి మరణించినట్లు కునో పార్కు పర్యవేక్షకులు తెలిపారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాల అనే చీతాకు రెండు నెలల క్రితం నాలుగు పిల్లలు పుట్టాయి. వీటిలో మూడు మరణించాయి. మంగళవారం ఓ చీతాకూన మరణించగా, తాజాగా మరో రెండు చీతా కూనలు మరణించాయి. నాలుగో చీతాకూన ఆరోగ్యం నిలకడగానే ఉందని, దానికి చికిత్స అందిస్తున్నామని కునో పార్కు అధికారులు తెలిపారు.
భారతదేశంలో చీతాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతా ద్వారా నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి 20 చీతాలను విడుదల వారిగా తీసుకొచ్చిన విషయం విధితమే. వీటిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషన్ పార్కులోని ప్రత్యేక ఎన్‌కోజర్ లో ఉంచారు. తొలుత వచ్చిన చీతాలను ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది తన పుట్టిన రోజు సందర్భంగా పార్కులోని ఎన్‌కోజర్‌లోకి వదిలారు. అయితే, ఈ ఏడాది మార్చిలో నమీబియా నుంచి తీసుకొచ్చిన సాశా అనే ఆడ చీతా మరణించింది. ఏప్రిల్ నెలలో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఉదయ్ అనే మగ చీతా మరణించింది. దక్షిణిఫ్రికా నుంచి తీసుకొచ్చిన దక్ష అనే ఆడచీతాకూడా అనారోగ్యంతో ఈనెల 9న మరణించింది.
తాజాగా.. జ్వాల అనే ఆడ చీతాకు పుట్టిన నాలుగు కూనల్లో మూడు చనిపోవటం కలవరానికి గురిచేస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఏమిటనేదానిపై స్పష్టత రాకపోయినా పార్కు ప్రాంతంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావటమేనని అధికారులు పేర్కొంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు అవి నీరసించి మరణించినట్లు పేర్కొంటున్నారు.
Also Read : Sydney Fire Accident: సిడ్నీలో భారీ అగ్ని ప్రమాదం.. నేలకూలిన 7 అంతస్థుల భవనం..