Mumbai airport: ముంబై ఎయిర్ పోర్ట్ లో సర్వర్ క్రాష్.. ఇబ్బంది పడిన ప్రయాణికులు
మహరాష్ట్ర రాజధాని, దేశ వాణిజ్య నగరమైన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రం సర్వర్లు డౌన్ అయ్యాయి.
- By Gopichand Published Date - 07:10 AM, Fri - 2 December 22

మహరాష్ట్ర రాజధాని, దేశ వాణిజ్య నగరమైన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రం సర్వర్లు డౌన్ అయ్యాయి. దీంతో గురువారం సాయంత్రం విమానాశ్రయంలోని టెర్మినల్ 2లో అన్ని వ్యవస్థలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో చెక్ ఇన్, లగేజ్ కోసం ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. సర్వర్ల క్రాష్ వల్ల కంప్యూటర్లు పని చేయకపోవడంతో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది మ్యానువల్ పద్ధతిని పాటించారు. దీంతో ప్రయాణికులు పలు గంటలపాటు క్యూలల్లో వేచి ఉన్నారు. దీని వల్ల విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. దీంతో విమానాశ్రయం అంతటా గందరగోళం నెలకొన్నది.
ముంబై విమానాశ్రయంలోని టెర్మినల్ 2లో గురువారం సాయంత్రం కంప్యూటర్ సిస్టమ్ క్రాష్ కావడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున క్యూలో నిలబడ్డారు. సర్వర్ వైఫల్యం కారణంగా దాదాపు 40 నిమిషాల పాటు ఆపరేషన్‌కు అంతరాయం ఏర్పడింది. దింతో విమానాశ్రయం వద్ద భారీ సంఖ్యలో ప్రయాణీకుల ఉన్న చిత్రాలను ప్రజలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారిలో ఒకరికి ఎయిర్ ఇండియా బదులిస్తూ అసౌకర్యాన్ని తగ్గించడానికి మా బృందం శ్రద్ధగా పని చేస్తోందని తెలిపింది.
మరోవైపు ఇబ్బందులు ఎదుర్కొన్న విమాన ప్రయాణికులు తమ ఆవేదనను ట్విట్టర్‌లో వ్యక్తం చేశారు. కాగా, ప్రయాణికుల ఇబ్బందిపై ఎయిర్ ఇండియా స్పందించింది. వారికి ఎదురైన అసౌకర్యాన్ని నివారించేందుకు తమ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ట్వీట్ చేసింది. అయితే ఎయిర్‌పోర్ట్‌టెర్మినల్ 2లో రెండు గంటల తర్వాత సాధారణ పరిస్థితి నెలకొంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ తర్వాత ముంబై విమానాశ్రయం దేశంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయం.
System crash at #MumbaiAirport @airindiain #allairlines Crazy crowd and long queues. Expect delayed flights and more… pic.twitter.com/3ImGgmjUYy
— Kiwi (@kiwitwees) December 1, 2022