HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Chandrababu Arrest Issue In Parliament

Parliament Special Session : పార్లమెంట్ సమావేశాల్లో కాకరేపిన చంద్రబాబు అరెస్ట్ అంశం..

అక్రమంగా అసలు స్కామే జరగని దాంట్లో చంద్రబాబు ను అరెస్ట్ చేసారని ఎంపీ గల్లా జయదేవ్ చెప్పుకొచ్చారు

  • Author : Sudheer Date : 18-09-2023 - 5:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
chandrababu-arrest-issue-in-parliament
chandrababu-arrest-issue-in-parliament

స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Case)లో చంద్రబాబు ను అరెస్ట్ చేయడాన్ని పార్లమెంట్ సభలో (Parliament Special Session) టీడీపీ ఎంపీ లు తప్పుపట్టారు. అక్రమంగా అసలు స్కామే జరగని దాంట్లో చంద్రబాబు ను అరెస్ట్ చేసారని ఎంపీ గల్లా జయదేవ్ చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకొని ఆయన బయటకు వచ్చేలా చూడాలని జయదేవ్ (MP Galla Jayadev) డిమాండ్ చేసారు.

గల్లాదేవ్ వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు హాయాంలోనే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ జరిగిందని, అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేశారని ఎంపీ పీవీ మిథున్ రెడ్డి అన్నారు. మిథున్ రెడ్డి (YCP MP Midhun Reddy) కౌంటర్ ఇస్తుండగా.. గల్లా జయదేవ్ కలగజేసుకొనే ప్రయత్నం చేయగా ‘నువ్వు మాట్లాడావ్ ఇక కూర్చో’ అంటూ వైసీపీ ఎంపీ అన్నారు. దీంతో కాసేపు ఇరువురి మధ్య మాటల యుద్ధం నడించింది.

అంతకు ముందు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పార్లమెంట్ ఆవరణంలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ‘ సేవ్ ఆంధ్ర ప్రదేశ్’, ‘ వి వాంట్ జస్టిస్ ‘ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగంతో చంద్రబాబు అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం జగన్ ప్రభుత్వానికి తగదని ఎంపీ రాంమోహన్ అన్నారు. జగన్ పాలన వల్ల రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని ఆరోపించారు. ప్రశ్నించే తత్వం ఉన్న యువతను దెబ్బతీస్తే తన అధికారానికి అడ్డు ఉండదని కుట్రతో లేని స్కిల్ డెవలప్మెంట్ స్కాం సృష్టించి క్రిమినల్ బుద్ధితో టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం జగన్ ఇరికించారని ఆరోపించారు.

Read Also :Chandrababu : చంద్రబాబు నిజంగా ఓ విజన్ – ఇన్వెంటస్ ఎండి కన్వాల్ రేఖీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chandrababu Arrest
  • galla jayadev
  • parliament
  • ycp mp midhun reddy

Related News

PM Modi

12 ఏళ్ల‌లో తొలిసారి.. అసంతృప్తి వ్య‌క్తం చేసిన పీఎం మోదీ!

నిన్న సాయంత్రం పార్లమెంటులో ఈ బిల్లుపై ఓటింగ్ జరిగింది. లోక్‌సభలో ‘రాజ్యాంగ (131వ) సవరణ బిల్లు 2026’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి.

  • Midhun Reddy

    Kutami Govt : కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • Ycp Mp Midhun Reddy Lok Sab

    Delimitation : డీలిమిటేషన్ ను స్వాగతిస్తున్నాం అంటూనే మెలిక పెట్టిన వైసీపీ ఎంపీ

  • Kangana Ranaut spoke about her bond with Chirag Paswan

    Kangana Ranaut: కేంద్ర మంత్రితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్

  • BJP's Tejasvi Surya Slams congress party

    BJP MP Tejasvi Surya: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వి సూర్య ఫైర్

Latest News

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

  • Ultratech : పారిశ్రామిక చరిత్రలో సరికొత్త రికార్డు సాధించిన అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్

  • Eruditus Open House Series 2026 : విదేశీ విశ్వవిద్యాలయాలకు హైదరాబాద్ అడ్డా

  • JEE : జేఈఈ ఫలితాల్లో ఆకాశ్ విద్యార్థుల హ్యాట్రిక్ స్కోర్లు

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd