Budget 2024 : బడ్జెట్ లో కొత్త ట్యాక్స్ ని ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్
- Author : Sudheer
Date : 01-02-2024 - 3:14 IST
Published By : Hashtagu Telugu Desk
గురువారం 2024 -25 కి సంబదించిన యూనియన్ బడ్జెట్ (Budget 2024 ) ను కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. మధ్యంతర బడ్జెట్ ను కేవలం 57 నిమిషాల్లోనే పూర్తి చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ బడ్జెట్ కొత్త ట్యాక్స్ (New tax)ను ప్రవేశ పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. కొత్త ట్యాక్స్ విధానంలో 7 లక్షల వరకూ ఎలాంటి పన్ను లేదని తేల్చి చెప్పారు. పన్నుల శ్లాబులు యథాతథంగా ఉంటాయని వెల్లడించారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు లేవని , కార్పొరేట్ ట్యాక్స్‌ని 30% నుంచి 22%కి తగ్గించామని తెలిపారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగాయని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
గత బడ్జెట్ లో ప్రకటించిన విధంగా స్టాండర్డ్ డిడక్షన్ అనేది 50 వేలు నుంచి 75 వేల రూపాయలకు పెంపు అనేది 2024 మార్చి నుంచి అమల్లోకి వస్తుందని.. కొత్తగా స్లాబ్ రేట్లను మార్చటం లేదని స్పష్టం చేసారు. ప్రస్తుతం ఉన్న పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు చేయటం లేదని.. ప్రత్యక్ష పన్నులు మూడు రెట్లు పెరిగాయని.. ఇందుకు పన్ను చెల్లింపుదారులకు అభినందలు తెలిపారు. ఎన్నికల ముందు తాత్కాలిక బడ్జెట్ కావడంతో ఆర్థిక మంత్రి కొత్త ప్రతిపాదనలు చేయకుండా శాఖలవారీ కేటాయింపులకే పరిమితమయ్యారు.
ఇక మధ్య తరగతికి కేంద్రం గుడ్‌న్యూస్ తెలిపింది. అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్ స్కీమ్ తీసుకొస్తున్నట్లు నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman) తెలిపారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంతింటి కలను నిజం చేస్తామని బడ్జెట్ (Union budget 2024) ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే, పీఎం ఆవాస్ యోజన కింద రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సొంతింటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన ‘పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్’ కరోనా కాలంలోనూ కొనసాగిందని , 3 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకోనున్నామని చెప్పారు.
Read Also : Interim Budget 2024-2025 : యూనియన్ బడ్జెట్ ను జస్ట్ 57 నిమిషాల్లో పూర్తి చేసిన నిర్మలా