NDA Meeting : ప్రధాని మోడీ రేయింబవళ్లు కష్టపడ్డారు – చంద్రబాబు
ఎన్నికల ప్రచారం ఆరంభం నుంచి చివరి వరకు మోడీ కష్టపడ్డారని, ఏపీలోనూ 3 బహిరంగ సభలు, ర్యాలీలో పాల్గొన్నారని వివరించారు
- By Sudheer Published Date - 02:19 PM, Fri - 7 June 24

ఎన్డీఏను అధికారంలోకి తేవడానికి ప్రధాని మోడీ రేయింబవళ్లు కష్టపడ్డారని టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రశంసించారు. కేంద్రంలో మరోసారి విజయడంఖా మోగించిన బిజెపి (BJP)..ఈరోజు ఢిల్లీలో ఎన్డీయే 3.0 కూటమి సమావేశం (NDA Meeting) ఏర్పాటు చేసింది. పాత పార్లమెంటు భవనంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్, నితీష్ సహా 9 మంది ఎన్డీయే మిత్రపక్షాల నేతలు హాజరయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. NDAను అధికారంలోకి తేవడానికి మోడీ రేయింబవళ్లు కష్టపడ్డారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం ఆరంభం నుంచి చివరి వరకు మోడీ కష్టపడ్డారని, ఏపీలోనూ 3 బహిరంగ సభలు, ర్యాలీలో పాల్గొన్నారని వివరించారు. మోడీ విజనరీ ఉన్న నాయకుడని, ఆయన నేతృత్వంలో భారత్ అభివృద్ధిలో ముందుందని అన్నారు. భారత దేశానికి సరైన సమయంలో సరైన నాయకత్వం అందివచ్చిందని బాబు అభిప్రాయపడ్డారు. మోడీ దూరదృష్టి కలిగిన నాయకుడని, భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారని ఆయన అన్నారు. మోడీ నాయకత్వంలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఆయన నేతృత్వంలో దేశం 2047 నాటికి నంబర్ వన్ గా నిలుస్తుందని అన్నారు.
ఇటీవల విడుదలైన లోక్సభ ఎన్నికల్లో ఫలితాల్లో ఎన్డీఏ 293 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. మెజారిటీ మార్కు 272ను కంటే ఎక్కువ సీట్లు రావడం వల్ల కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వరుసగా మూడోసారి అధికారం చేపట్టనుంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ మార్కును దాటలేకపోయింది. దీంతో మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఏపీ కూటమి అవసరం NDA కు కీలకంగా మారింది.
Read Also :NDA Government Formation : ‘ఇక్కడ కూర్చుంది పవన్ కాదు.. తుఫాన్’ – మోడీ