CBI : పశ్చిమ బెంగాల్‌లో సీబీఐ దాడులు.. బీజేపీ ఎమ్మెల్యే సహా అధికారుల ఇళ్లలో సోదాలు చేస్తున్న సీబీఐ
పశ్చిమ బెంగాల్‌లో స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
- By Prasad Published Date - 10:54 PM, Mon - 9 October 23

పశ్చిమ బెంగాల్‌లో స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అంతటా బిజెపి ఎమ్మెల్యే పార్థ సారథి ఛటర్జీ నివాసంతో సహా పలువురు అధికారుల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. రణఘాట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఛటర్జీ గతంలో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) సభ్యుడిగా ఉన్నప్పుడు రాణాఘాట్ మునిసిపాలిటీకి చైర్మన్‌గా పనిచేశారు. ఆ తరువాత ఆయన 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరాడు. బీజేపీలో కూడా రణఘాట్ నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి ఛటర్జీ నివాసంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో ఆరు చోట్ల సీబీఐ దాడులు నిర్వహించింది. ఈ శోధనలు స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై విస్తృత దర్యాప్తులో భాగంగా ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
డైమండ్ హార్బర్ మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్ మీరా హల్దర్ నివాసంపై కూడా దర్యాప్తు సంస్థ దాడులు చేసింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సభ్యులతో కలిసి సిబిఐ బృందం ఈ రోజు ఉదయం 11 గంటలకు దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని ఆమె ఇంటికి చేరుకుంది. 2016లో హాల్డర్ పదవిలో ఉన్నప్పుడు రిక్రూట్‌మెంట్ స్కామ్ జరిగింది. ఈ అక్రమాలలో ఆమె ప్రమేయం గురించి సీబీఐ ప్రస్తుతం ఆమెను ప్రశ్నిస్తోంది. ఈ కేసుకు సంబంధించి కోల్‌కతా మేయర్, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ఫిర్హాద్ హకీమ్, టిఎంసి ఎమ్మెల్యే మదన్ మిత్రా ఇళ్లతో సహా పశ్చిమ బెంగాల్‌లోని 15 చోట్ల ఆదివారం తెల్లవారుజామున సిబిఐ దాడులు చేసింది.
Also Read: Election Code In Telangana: డిజిటల్ మీడియా ఫై బిఆర్ఎస్ కన్ను