KBC 1 Crore Questions : కౌన్ బనేగా కరోడ్ పతిలో అడిగే కోటి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా?
- By hashtagu Published Date - 10:39 AM, Sun - 20 November 22

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న కౌన్ బనేగా కరోడ్ పతిలో చాలా మంది తమ లక్ ను పరీక్షించుకునేందుకు పోటీ పడుతుంటారు. ఈ షోలో అడిగే అనేక ప్రశ్నలకు సరైన సమాధాలు చెబుతూ ఒక్కో దశకు దాచుకుంటూ లక్షల నుంచి కోటి రూపాయల వరకు గెలుస్తారు. వెయ్యి రూపాయల ప్రశ్నతో మొదలవుతుంది ఈ గేమ్. 7 కోట్లవరకు చేరకుంటుంది. కొంతమంది కంటెస్టెంట్స్ తక్కువ మొత్తంతో బయటకు వెళ్తారు. అయితే చాలా మంది కోటి నుంచి 7 కోట్ల వరకు చేరుకుంటారు. అయితేమీకు ఎంతో కొంత పరిజ్ణానం ఉండే ఉంటుంది. ఈ షోకు మీరూ వెళ్లాలనుకుంటే…1కోటీ విలువైన ఈ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం చెప్పండి. ఆ ప్రశ్నలేంటో ఓ సారి చూద్దాం.
1. ఒక వ్యక్తి మొదటిసారిగా 8వేల మీటర్ల ఎత్తున శిఖరాన్ని ఆధిరోయించిన పర్వతం ఏది?
2. 12ఏళ్ల 4నెలల 25రోజుల వయస్సుల్లో ప్రపంచంలో అత్యంత చిన్న వయస్కుడైన చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు?
3.యూపీలోని ఘాజీపూర్ లో ఉన్న లోపలిస్తంభం ఏ సామాజ్యానికి చెందినది ?
4.1817లో ముంబైలోని వాడియా గ్రూప్ నిర్మించిన ఓ ఏది?
5. అంతరిక్ష నౌకలో చంద్రునిపైకి వెళ్లి భూమికి తిరిగి వచ్చిన మొదటి జంతువు ఏది ?
6. ఉత్తమ గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న నటి ఎవరు?
9. అతిథి దేవో భవ అంటే అతిథి దేవుడే అనే సంస్క్రుత పదబంధం ఏ ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు?
10.భారత రాజ్యంగం ఎవరికి పార్లమెంట్ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది
11. మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ ఆస్తానంలో 1857 తిరుగుబాటుకు సంబంధించిన వ్యక్తిగత కథనమైన దస్తాన్ ఎ గదర్ ను ఏ కవి రచించాడు.
ఈ పదకొండు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పేందుకు మీరూ ప్రయత్నించండి.