Pakistan : దేశంలోని ఏ ప్రాంతాన్నీ పాకిస్తాన్ అని పిలవొద్దు : సుప్రీంకోర్టు
జడ్జి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద ఓ కేసు విచారణ సందర్భంగా బెంగళూరు నగరంలోని ముస్లిం మెజారిటీ ప్రాంతాన్ని పాకిస్తాన్‌గా(Pakistan) పిలిచారు.
- By Pasha Published Date - 12:36 PM, Wed - 25 September 24

Pakistan : కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానందపై సుప్రీంకోర్టు బెంచ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌లోని ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా పాకిస్తాన్ అని పిలవడం సరికాదని.. ఒకవేళ అలా పిలిస్తే దేశ సమగ్రతకు భంగం కలిగించినట్లు అవుతుందని స్పష్టం చేసింది. జడ్జి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద ఓ కేసు విచారణ సందర్భంగా బెంగళూరు నగరంలోని ముస్లిం మెజారిటీ ప్రాంతాన్ని పాకిస్తాన్‌గా(Pakistan) పిలిచారు. ఈ అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ కేసులో ఒక పక్షం తరఫున వాదనలు వినిపించిన మహిళా న్యాయవాదిని ఉద్దేశించి జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్నిఖండించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల జడ్జీల ప్రతిష్ఠ మసకబారుతుందని హెచ్చరించింది. న్యాయమూర్తులు పక్షపాతం లేకుండా అందరినీ ఒకేలా పరిగణించి వ్యాఖ్యలు చేయాలని సూచించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా జడ్జీలకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేస్తామని సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది. ఈ కేసును ఇంతటితో మూసివేస్తున్నట్లు సీజేఐ డీవై చంద్రచూడ్ వెల్లడించారు.
Also Read :Deendayal Upadhyaya : ఇవాళ అంత్యోదయ దివస్.. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జీవితంలోని కీలక ఘట్టాలివి
సాధారణంగానైతే కోర్టులలో జరిగే విచారణ క్లిప్స్ బయటికి రావు. వాటి వీడియో షూటింగ్‌కు అనుమతి అస్సలు ఉండదు. అయితే 2021 సంవత్సరంలో కరోనా మహమ్మారి ఎఫెక్టు కారణంగా కేసుల విచారణ వర్చువల్‌గా జరిగింది. అప్పట్లో కేసుల వర్చువల్ విచారణ ప్రక్రియను కోర్టుల ప్రత్యేక యూట్యూబ్ ఛానళ్లలో లైవ్ చేశారు. అప్పట్లో ఓ ఇంటి యజమాని, అద్దెదారుడికి సంబంధించిన కేసు కర్ణాటక హైకోర్టుకు వచ్చింది. దాన్ని విచారించిన జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద బెంచ్.. ఓ పక్షంవారిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read :Pakistan Beggars : పాకిస్తాన్ భిక్షగాళ్లకు సౌదీ అరేబియా వార్నింగ్.. ఎందుకు ?
‘‘బెంగళూరు నగరంలోని ఆ ఏరియా ఒక పాకిస్తాన్ లాంటిది’’ అని కామెంట్ చేశారు. ఆ కేసుకు సంబంధించి ఒక పక్షం తరఫున వాదనలు వినిపించిన మహిళా లాయర్‌పైనా అసభ్య వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ అంశాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న అనంతరం పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద.. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఎట్టకేలకు ఆ జడ్జీపై లీగల్ ప్రొసీడింగ్స్‌ను క్లోజ్ చేస్తున్నట్లు ఇవాళ సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రకటించారు.