Bus Fell Into Valley : లోయలో పడిన బస్సు.. ఏడుగురి మృతి.. 26 మందికి గాయాలు
Bus Fell Into Valley : హర్యానా టూరిస్టుల బస్సు 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది.
- Author : Pasha
Date : 09-10-2023 - 7:40 IST
Published By : Hashtagu Telugu Desk
Bus Fell Into Valley : హర్యానా టూరిస్టుల బస్సు 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఆదివారం రాత్రి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనితాల్ జిల్లా కలాధుంగిలోని నల్ని ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఏడుగురు పర్యాటకులు చనిపోగా, 26 మంది గాయపడ్డారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సంభవించిన టైంలో ఈ బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులంతా హర్యానాలోని హిస్సార్ జిల్లాకు చెందినవారు. వీరంతా నైనితాల్ ను సందర్శించి హర్యానాలోని హిస్సార్ కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. బస్సు ప్రమాదానికి గల కారణాలు (Bus Fell Into Valley) ఇంకా తెలియరాలేదు.
We’re now on WhatsApp. Click to Join
మరోవైపు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితౌరాగఢ్ జిల్లా కైలాష్ మానసరోవర్ రోడ్డులోని థాక్తి ప్రాంతంలో 8 మందితో వెళ్తున్న బొలేరో వాహనంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మరణించారు. కొండచరియలు విరిగిపడటం వల్ల వాహనం శిథిలాల కింద కూరుకుపోయింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసులు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు, ఆర్మీ దళాలు ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. దీంతో కేదార్‌నాథ్ జాతీయ రహదారిపై కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం వాటిల్లింది.