85000 Bonus : 3.50 లక్షల మందికి చెరో రూ.85వేల దీపావళి బోనస్ !!
85000 Bonus : కోల్ ఇండియా కీలక ప్రకటన చేసింది. బొగ్గు గని కార్మికులు ఒక్కొక్కరికి 85వేల రూపాయల చొప్పున దీపావళి బోనస్ ను ప్రకటించింది.
- By Pasha Published Date - 01:08 PM, Mon - 9 October 23

85000 Bonus : కోల్ ఇండియా కీలక ప్రకటన చేసింది. బొగ్గు గని కార్మికులు ఒక్కొక్కరికి 85వేల రూపాయల చొప్పున దీపావళి బోనస్ ను ప్రకటించింది. ఈ బోనస్ ను దీపావళి సందర్భంగా కోల్ ఇండియా పరిధిలోని దాదాపు 3.50 లక్షల మంది కార్మికులు అందుకోనున్నారు. తాజాగా కోల్ ఇండియా కార్యాలయంలో కార్మిక సంఘాలతో జరిగిన సమావేశంలో దీపావళి బోనస్ విషయంలో నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈసారి లక్ష రూపాయల బోనస్ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేయగా..కోల్ ఇండియా యాజమాన్యం దాన్ని రూ.85వేలుగా ఫైనల్ చేసింది. దీనిపై యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.
We’re now on WhatsApp. Click to Join
ఈ బోనస్ అనేది సీసీఎల్ కు చెందిన 33 వేల మంది కార్మికులు, బీసీసీఎల్‌కు చెందిన 36 వేల మంది కార్మికులు, కోల్ ఇండియా అసోసియేట్ కంపెనీలకు చెందిన 2లక్షల 23వేల మంది కార్మికులకు అందనుంది. గతేడాది బొగ్గు గని కార్మికులకు దీపావళి బోనస్‌గా రూ. 76,500 ఇచ్చారు. ఈసారి దాన్ని రూ.8,500 మేర పెంచారు. బోనస్ డబ్బులను దీపావళికి వారం, పది రోజుల ముందే అకౌంట్లలో జమ చేస్తారు. ఏటా కోల్ ఇండియాకు వస్తున్న లాభాల ఆధారంగా బొగ్గు కార్మికులకు బోనస్ ను (85000 Bonus) ఇస్తున్నారు.