HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >British Media Target India Uk Journalist Says Return Our 2 3 Bn After Indias Chandrayaan 3 Mission Internet Blasts Him

British media target India : చంద్ర‌యాన్ 3పై బ్రిటీష్ మీడియా అక్క‌సు! తిర‌గ‌బ‌డ్డ భార‌తీయులు!!

భార‌త విజ‌యాన్ని (British media target India)యూకేవిన‌లేక‌పోతోంది.చంద్రయాన్ 3 ప్ర‌యోగంతో భార‌త్ కు వ‌స్తోన్న‌ ప్ర‌తిష్ట‌ను విన‌లేక‌పోతోంది.

  • By CS Rao Published Date - 05:09 PM, Thu - 24 August 23
  • daily-hunt
British Media Target India
British Media Target India

భార‌త దేశం విజ‌యాన్ని (British media target India) యూకే త‌ట్టుకోలేక‌పోతోంది. చంద్రయాన్ 3 ప్ర‌యోగంతో అంత‌ర్జాతీయంగా భార‌త్ కు వ‌స్తోన్న‌ ప్ర‌తిష్ట‌ను విన‌లేక‌పోతోంది. భార‌త‌దేశపు పేద‌రికానికి, చంద్ర‌యాన్ 3కి ముడిపెడుతూ బీబీసీ అహంకారపూరిత వ్యాఖ్యానాలు చేసింది. ఆ టీవీ ఛాన‌ల్ లోని యాంక‌ర్ ప్ర‌యోగించిన వ్యాఖ్య‌ల‌పై యావ‌త్తు భార‌త దేశం మండిప‌డుతోంది. ప్ర‌త్యేకించి సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మ‌హీంద‌ర్ బ్రిటీష్ యాంక‌ర్ కు చుర‌క‌లు వేశారు. పేదరికంతో మగ్గుతోన్న భార‌త దేశంకు పెద్ద ఎత్తున ఖ‌ర్చుచేసి చంద్ర‌యాన్ 3 ప్ర‌యోగం అవ‌స‌ర‌మా? అంటూ UK వార్తా వ్యాఖ్యాత పాట్రిక్ క్రిస్టీస్ ప్ర‌శ్నించ‌డం బ్రిటీషర్ల దిగ‌జారుడుకు నిద‌ర్శ‌నంగా ఉంది.

భార‌త దేశం విజ‌యాన్ని యూకే త‌ట్టుకోలేక‌ (British media target India)

అగ్ర‌రాజ్యాలుగా పేరున్న ర‌ష్యా, అమెరికా, చైనా స‌ర‌స‌న చంద్రయాన్-3 మిషన్‌తో  (British media target India)  భార‌త్ నిలిచింది. ప్రపంచం నలుమూలల నుండి అభినందనలను అందుకుంటోంది. అదే త‌ర‌హాలోచంద్ర యాన్ 3 విజ‌యవంతంపై అభినందనలు తెలిపిన పాట్రిక్ క్రిస్టీస్ కొన‌సాగింపుగా భార‌త పేద‌రికాన్ని జోడించారు. న్యూస్ బులెటిన్‌లో అతను చేసిన వ్యాఖ్య‌ల‌పై సోషల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్లు ఆగ్ర‌హించేలా ఉన్నాయి. భారతదేశాన్ని అభినందిస్తూ బులెటిన్‌ను ప్రారంభించిన పాట్రిక్ భారత్‌కు సహాయంగా ఇచ్చిన” 2.3 బిలియన్ పౌండ్లను వెనక్కి తీసుకోవాలని బ్రిటీష్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేయ‌డం “అసూయతో కూడిన జాత్యహంకారం` గా యావ‌త్తు నెటిజ‌న్లు అభివ‌ర్ణిస్తున్నారు.

2.3 బిలియన్ పౌండ్లను వెనక్కి తీసుకోవాలని బ్రిటీష్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్

`చంద్రుని ద‌క్షిణ ధృవంపై అడుగుపెట్టినందుకు భారతదేశాన్ని  (British media target India) నేను అభినందించాలనుకుంటున్నాను. 2016 మరియు 2021 మధ్య మేము పంపిన 2.3 బిలియన్ పౌండ్ల సహాయ డబ్బును తిరిగి ఇవ్వమని నేను భారతదేశాన్ని ఆహ్వానించాలనుకుంటున్నాను. మేము వచ్చే ఏడాది 57 మిలియన్ పౌండ్‌లను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ బ్రిటీష్ పన్ను చెల్లింపుదారుడు దానిని అడ్డుకోవాల‌ని నేను భావిస్తున్నాను. నియమం ప్రకారం అంతరిక్ష కార్యక్రమం ఉన్న దేశాలకు మనం డబ్బు ఇవ్వకూడదు, ”అని పాట్రిక్ టీవీ షోలో వ్యాఖ్యానించారు.

భారతదేశం “పేదరికం`లో ఉంద‌ని పాట్రిక్ (British media target India)

భారతదేశం “పేదరికం`లో ఉంద‌ని పాట్రిక్ అని అన్నారు. ఆ దేశానికి మరింత ఆర్థిక సహాయానికి వ్యతిరేకంగా UK ప్రభుత్వానికి సలహా ఇచ్చాడు. “మీరు చంద్రుని వైపు రాకెట్‌ను పంప‌గ‌లిగారు. భారతదేశంలో 229 మిలియన్ల మంది పేదరికంలో మగ్గుతున్నారు. ఐక్య‌రాజ్య స‌మితి నివేదిక‌ ప్రకారం, ఇది ప్రపంచంలో ఎక్కడా లేని అత్యధిక సంఖ్య. ఇది దాదాపు 3.75 ట్రిలియన్ డాలర్ల వార్షిక GDPతో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. వారి స్వంత ప్రభుత్వమే పేద‌ల కోసం ఖ‌ర్చుపెట్ట‌న‌ప్పుడు, పేదరికంలో ఉన్న భారతీయులకు సహాయం చేయడానికి మేము ఎందుకు నిధులు ఇవ్వాలి ”అంటూ (British media target India) పాట్రిక్ అన్నారు.

మ‌త మార్పిడి కోసం భారతదేశంలోని కొన్ని NGOలకు డబ్బు

ఈ వీడియోను చూసిన తర్వాత X వినియోగదారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “ఓ అసూయతో కూడిన జాత్యహంకారం! మీరు భారతదేశం నుండి $45 ట్రిలియన్లకు పైగా దొంగిలించారు, దేశాన్ని ఛిన్నాభిన్నంగా చేసి మురికిని మిగిల్చారు. అయినప్పటికీ భారతదేశం అధిగమించి నేడు మీ ఆర్థిక వ్యవస్థను అధిగమించింది. కేవలం భారతదేశం నుండి దోచుకున్న $45 ట్రిలియన్లు + బ్రిటన్ ఏమి చేసింది? NHS నిరుత్సాహంగా ఉంది. నేను చూసే దాదాపు ప్రతి వీడియో బ్రిటీష్ పౌరులు పేదరికంలో నివసిస్తున్నారు. వారి ఇళ్ల నుండి తరిమివేయబడ్డారు. హౌసింగ్ కోసం వెతుకుతున్నారు. కిరాణా సామాను కొనుగోలు చేయలేరు. మీ మహిళలు , పిల్లలను నాశనం చేయడమే కాకుండా క్రూరంగా హింసించే ముఠాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశం మిమ్మల్ని సహాయం కోసం ఎన్నడూ అడగలేదు. అన్య‌మ‌త మార్పిడి కోసం భారతదేశంలోని కొన్ని NGOలకు డబ్బు పంపుతారు. ఆ డబ్బును తీసుకోండి. నిరాశ్రయులైన మీ జనాభా కోసం ముందుగా కొన్ని ఇళ్లను నిర్మించండి, ”అని భార‌త నెటిజ‌న్లు  (British media target India)  పాక్రిన్ కు   చుర‌క‌లు వేశారు.

Also Read : Chandrayaan-3 Landing: చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్.. ఈ మిషన్‌లో పాల్గొన్న కంపెనీల షేర్లపై ప్రభావం..!

“కొన్ని రోజులు ఆనందించండి బ్రో. భారతదేశానికి కృతజ్ఞతలు చెప్పాలి. జై హింద్” అని మరొక ట్వీట్ చేశారు..క్రిస్టీస్ ఎదుర్కొన్న ఎదురుదెబ్బతో ’45 ట్రిలియన్’ Xలో ట్రెండింగ్‌ను ప్రారంభించింది. జర్నలిస్ట్ సోఫీ కోర్కోరన్ ఒక పోస్ట్‌లో UK భారతదేశానికి సహాయం పంపకూడదని అన్నారు. “మేము మా డబ్బును తిరిగి పొందుతాము” అని కూడా ఆమె చెప్పింది. ప‌త్రిక‌ల్లో ఆహా ఓహో అన్న ఈ బ్రిటన్ మీడియా దిగ్గజం, టీవీ చానల్లో మాత్రం భారత్ పై అక్కసు వెళ్లగక్కింది. “మౌలిక సదుపాయాలు లేకుండా, దుర్భర దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్న భారత్… అంతరిక్ష పరిశోధల కోసం ఇంత ఖర్చు చేయడం అవసరమా?” అని బీబీసీ పేర్కొన‌డంపై భార‌తీయులు మండిప‌డుతున్నారు. భారత పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా దీటుగా స్పందించారు. “బీబీసీ చెప్పింది నిజమా… అయితే ఈ వాస్తవం వినండి! దశాబ్దాల వలస పాలనే మా పేదరికానికి కారణం. ఓ క్రమపద్ధతిలో యావత్ భారత ఉపఖండాన్ని కొల్లగొట్టారు. మా నుంచి దోపిడీకి గురైన అత్యంత విలువైన వస్తువు కోహినూర్ వజ్రం కాదు… మా ఆత్మాభిమానం, స్వీయ సామర్థ్యాలపై మా నమ్మకం… దోపిడీకి గురైంది ఇవీ. మీరు మాకుంటే తక్కువ వారు అని మాతోనే ఒప్పించాలన్నది వలస రాజ్య లక్ష్యం.

Also Read : Chandrayaan 2 : చంద్ర‌యాన్ 2 రోవ‌ర్ క‌క్ష్యలో మార్పులు – ఇస్రో

మేం మరుగుదొడ్లలో పెట్టుబడి పెడతాం… అంతరిక్ష యాత్రల్లో కూడా పెట్టుబడి పెడతాం… అదేమీ విరుద్ధమైన పని కాదు సర్ (చానల్ యాంకర్ ను ఉద్దేశించి). చంద్రునిపై అడుగుపెట్టామంటే అది మా ప్రతిష్ఠను, ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించడానికి సాయపడుతుంది కాబట్టి. శాస్త్ర విజ్ఞానం ద్వారా మేం పురోగతి సాధించగలం అనే నమ్మకాన్ని ఇది కలిగిస్తుంది. పేదరికం నుంచి మమ్మల్ని మేం బయటపడేసుకోగలమన్న ఆశను ఇది కలిగిస్తుంది. ఆకాంక్ష అనేది లేకపోవడమే అత్యంత పేదరికం” అంటూ ఆనంద్ మహీంద్రా సదరు బ్రిటీష్ మీడియా సంస్థకు చురక అంటించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bbc controversy
  • British media target India
  • Chandrayaan 3

Related News

    Latest News

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd