Shocking: ఇదేం పోయేకాలం..రా.. నాయనా.. నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా.. శోభనం రోజు భర్తకు భార్య వార్నింగ్
వివాహం జరిగిన తొలి రోజే భర్తను కత్తితో బెదిరించి, కొద్ది రోజుల్లోనే మేనల్లుడితో పారిపోయిన యువతికి సంబంధించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలో కలకలం రేపుతోంది.
- By Kavya Krishna Published Date - 03:11 PM, Wed - 25 June 25

Shocking: వివాహం జరిగిన తొలి రోజే భర్తను కత్తితో బెదిరించి, కొద్ది రోజుల్లోనే మేనల్లుడితో పారిపోయిన యువతికి సంబంధించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలో కలకలం రేపుతోంది. భర్త నిషాద్ పోలీసులకు తెలిపిన వివరాలు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నిషాద్ అనే యువకుడు ఇటీవల సితార అనే యువతిని వివాహం చేసుకున్నాడు. శోభనం రోజు గదిలోకి ఆమె చేతిలో కత్తి పట్టుకుని ప్రవేశించి, “నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా” అని బెదిరించినట్లు నిషాద్ వెల్లడించాడు. అదే రోజు తనకు సితార ఇప్పటికే తన మేనల్లుడు అమన్‌ను ప్రేమిస్తున్నట్టు చెప్పినట్లు పేర్కొన్నాడు.
PM Modi : నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది: ప్రధాని మోడీ
సితార తనను కేదార్‌నాథ్ యాత్రకు తీసుకెళ్లాలని కోరినప్పటికీ, ఇటీవల సంచలనం సృష్టించిన రాజరఘువంశి హత్య ఘటన గుర్తొచ్చి వెళ్లలేకపోయానని నిషాద్ తెలిపారు. భర్తను చంపే కుట్ర ఉందన్న అనుమానం తలెత్తడంతో జాగ్రత్తగా వ్యవహరించానన్నారు. వివాహం అనంతరం సితార మూడు రోజులు నిషాద్ ఇంట్లో ఉన్నాక, ఒకరోజు అర్ధరాత్రి గోడ దూకి తన ప్రేమికుడు అమన్‌తో కలిసి పరారైంది. ఆమె ప్రేమికుడు, తన స్నేహితులతో కలిసి చంపేస్తామంటూ బెదిరించినట్లు నిషాద్ తెలిపారు. ఈ ఘటనపై స్థానికంగా భయాందోళన నెలకొంది.
తన జీవితంలో జరిగిన ఈ అనుభవం మరచిపోలేనిదిగా మారిందని నిషాద్ తెలిపారు. “తనతో ఉన్న మూడు రోజులు, ఎప్పుడు చంపేస్తుందో అనే భయంలో నిద్రపట్టలేదు. ఇప్పుడైతే ‘పెళ్లి’ అనే మాట వింటేనే గుండెల్లో దడ పుడుతుంది,” అని తన వేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన దంపతుల జాడ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Shubhanshu Shukla : అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా సందేశం..మీరంతా నా వెంటే