‘Born In The Air’ : విమానంలో గర్భిణికి డెలివరీ చేసిన పైలట్..
- By Sudheer Published Date - 03:36 PM, Tue - 5 March 24

గత కొద్దీ రోజులుగా విమానాల్లో (Flights) జరిగే వింతలు , విశేషాలు , గొడవలు , అద్భుతాలు ఇలా అనేకమైనవి వార్తల్లో నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలతో కొంతమంది భయపడుతుంటే..మరికొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాత్రం గర్భిణికి డెలివరీ (Deliver ) చేసి వావ్ అనిపించుకున్నాడు పైలట్.
ఇటీవల తైవాన్ నుండి ఒక విమానం బ్యాంకాక్ వెళ్తోంది. ఈ క్రమంలో ఓ గర్భిణి ప్రసవ నొప్పితో బాధపడుతుంది..కాసేపటికే ఆ నొప్పులు ఎక్కవయ్యాయి. విమానం ఎక్కడైనా దించి మహిళను హాస్పిటల్ కు తీసుకెళ్లేంత సమయం లేదు. సదరు మహిళా పడుతున్న బాధను చూసి తోటి ప్రయాణికులకు ఏంచేయాలో అర్ధం కావడం లేదు. ఈ క్రమంలో పైలట్ జాకరిన్ (Jakarin Sararnrakskul) ఈ విషయం తెలిసి.. కాక్ పిట్ వదిలి పరుగున ఆ మహిళ దగ్గరికి వచ్చాడు. మొదట విమానంలో ఎవరైనా డాక్టర్ ఉన్నారా అని అడగ్గా..ఎవరూ లేకపోవడంతో తనే డాక్టర్ గా మారాడు. సెల్‌ఫోన్ ద్వారా వైద్యులను సంప్రదించిన పైలట్, వారి సూచనలతో గర్భిణికి పురుడు పోశారు.
We’re now on WhatsApp. Click to Join.
పైలట్ జాకరిన్ చేసిన పనికి తోటి ప్రయాణికులంతా ప్రశంసలు కురిపించారు. విమానంలో జన్మించిన ఈ చిన్నారికి సిబ్బంది ముద్దుగా ‘స్కై’ అని పేరు పెట్టారు. ల్యాండింగ్ అనంతరం తల్లీబిడ్డలను వైద్య సిబ్బంది పరీక్షించారు. వారు ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్లుగా పైలట్‌గా వ్యవహరిస్తున్న జాకరిన్ గతంలో ఎప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కోలేదని చెప్పారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ట్రావెల్ మెడిసిన్ 2020లో చేసిన అధ్యయనం ప్రకారం 1929 నుంచి 2018 మధ్య వివిధ విమానాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. మొత్తం విమానంలో 74 మంది చిన్నారులు జన్మించగా అందులో 71 మంది సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది.
Read Also : Celebrity Guests : ఆ పెళ్లిళ్లకు వెళితే కాసుల వర్షమే.. నాగార్జున కామెంట్స్‌కు అనంత్ అంబానీ పెళ్లితో లింక్ ?