Bomb Threat Calls : విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ అన్ని అక్కడి నుండే..
Bomb Threat Calls : గత రెండు వారాల్లో వచ్చిన 400లకు పైగా నకిలీ బెదిరింపుల్లో 90% వరకు యునైటెడ్ కింగ్డమ్ (UK) నుంచి వచ్చినట్టు తెలుస్తోంది
- Author : Sudheer
Date : 28-10-2024 - 6:36 IST
Published By : Hashtagu Telugu Desk
గత కొద్దీ రోజులుగా విమానాలకు (Air planes) బాంబ్ బెదిరింపు కాల్స్ (Bomb Threat Calls) ఎక్కువైనా సంగతి తెలిసిందే. ఈ కాల్స్ వాస్తవంగా ఉండకపోయినా, సెక్యూరిటీ కారణంగా ఈ అప్రమత్తత చర్యలు చాలా సీరియస్‌గా తీసుకోవడం జరుగుతోంది. బాంబు బెదిరింపు కాల్ వచ్చినప్పుడు సెక్యూరిటీ సిబ్బంది వెంటనే చర్యలు చేపడుతున్నారు. విమానం ఎక్కడున్నా, అది గాల్లో ఉన్నా, భూమిపై ఉన్నా ఆ విమానాన్ని వెంటనే నిర్ధిష్ట ప్రదేశంలో నిలిపి సెక్యూరిటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనంతరం అందులోని ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్స్ ను విమానంలో అనుమానాస్పద వస్తువులను గమనించడానికి వాడుతూ వస్తున్నారు. బెదిరింపు కాల్ ఫేక్ అని తెలిసిన తర్వాత మళ్లీ పంపించడం జరుగుతుంది. ప్రతి రోజు ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తూ అధికారులను ,ప్రయాణికులను చెమటలు పట్టిస్తున్నాయి.
ఈరోజు కూడా విశాఖ (Vizag) నుంచి ముంబై బయల్దేరాల్సిన ఇండిగో విమానానికి (Indigo flight) బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మధ్యాహ్నం 3.10 గంటలకు విమానం టేకాఫ్ కావాల్సి ఉండగా బాంబు బెదిరింపుతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు ఫ్లెట్ విశాఖలోనే ఉండిపోయింది. కాగా ఇటీవల దేశంలో వందల సంఖ్యలో విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులపై దర్యాప్తు సంస్థలకు మొదటి లీడ్ లభించినట్టుగా తెలుస్తోంది. గత రెండు వారాల్లో వచ్చిన 400లకు పైగా నకిలీ బెదిరింపుల్లో 90% వరకు యునైటెడ్ కింగ్డమ్ (UK) నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు VPN, డార్క్ వెబ్ అడ్రస్ల ద్వారా కౌంటర్ టెర్రరిజమ్ డివిజన్ గుర్తించగలిగినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంలో NIA కూడా దర్యాప్తు చేస్తోంది.
Read Also : BJP : మహారాష్ట్ర ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల