HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Bjp Mla Ticket For 25 Year Old Singer

Bihar Elections : 25 ఏళ్ల సింగర్ కు బీజేపీ ఎమ్మెల్యే టికెట్

Bihar Elections : బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కళా ప్రపంచం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఫోక్ సింగర్ మైథిలి ఠాకూర్ (Folk Singer Maithili Thakur) బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు

  • By Sudheer Published Date - 07:22 PM, Wed - 15 October 25
  • daily-hunt
Folk Singer Maithili Thakur
Folk Singer Maithili Thakur

బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కళా ప్రపంచం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఫోక్ సింగర్ మైథిలి ఠాకూర్ (Folk Singer Maithili Thakur) బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. పార్టీ తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో అలీనగర్ నియోజకవర్గం నుంచి ఆమెకు అవకాశం లభించింది. 25 ఏళ్ల మైథిలి నిన్ననే అధికారికంగా బీజేపీలో చేరారు. ఆమెకు కళారంగంలో ఉన్న గుర్తింపు, ప్రజలతో ఉన్న అనుబంధం, యువతలో ఉన్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో కొత్తదనం తీసుకురావాలని భావించిన మైథిలి, బిహార్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు.

‎Sitting on Floor: నేలపై కూర్చొని తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. డైనింగ్ టేబుల్ కి బైబై చెప్పేస్తారు!

మైథిలి ఠాకూర్ పేరు దేశవ్యాప్తంగా ఫోక్ మ్యూజిక్ ప్రియులకు సుపరిచితమే. చిన్న వయసులోనే పలు భాషల్లో పాటలు పాడి సోషల్ మీడియాలో విశేష ప్రజాదరణ పొందిన ఆమె, భారతీయ సాంప్రదాయ గీతాలకు ఆధునిక శైలిలో కొత్త జీవం పోశారు. మైథిలి హిందీ, భోజ్‌పురి, మైథిలి, బెంగాలీ, తమిళం, తెలుగుతో పాటు అనేక భారతీయ భాషల్లో పాటలు పాడి దేశమంతటా అభిమానులను సంపాదించారు. సంప్రదాయ సంగీతాన్ని కొత్త తరాలకు చేరవేయడంలో ఆమె చేసిన కృషి ప్రశంసనీయమైంది. ముఖ్యంగా భారతీయ సంస్కృతి, గ్రామీణ ఫోక్ కళలను ప్రతిబింబించే ఆమె గాత్రం, ప్రదర్శన శైలీ ప్రజల్లో ఆదరణ పొందింది.

ఇటీవల మైథిలి ప్రధానమంత్రి చేతుల మీదుగా ‘కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకోవడం ఆమె ప్రజాదరణకు నిదర్శనం. ఈ గౌరవం ఆమెను రాజకీయ రంగంలోకి అడుగుపెట్టేలా ప్రేరేపించిందని పరిశీలకులు భావిస్తున్నారు. బిహార్ సాంస్కృతిక విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన కళాకారిణి ఇప్పుడు ప్రజా సేవ దిశగా అడుగులు వేస్తుండటం విశేషం. అలీనగర్ ప్రజల్లో ఆమెకు ఉన్న అభిమానం, యువతలో ఉన్న ఆకర్షణ బీజేపీకి బలాన్నిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కళా ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మైథిలి విజయవంతమవుతారా అనే ప్రశ్నకు సమాధానం ఈ ఎన్నికల ఫలితాల్లో తేలనుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bihar Elections
  • bjp
  • BJP ticket
  • Folk Singer Maithili Thakur
  • Maithili Thakur
  • Maithili Thakur back ground

Related News

Uttam Speech

Jubilee Hills Bypoll : మైనారిటీలకు శక్తినిచ్చే సామర్థ్యం కాంగ్రెస్‌కే సాధ్యం – ఉత్తమ్

Jubilee Hills Bypoll : కాంగ్రెస్‌ పార్టీ నిజమైన ధర్మనిరపేక్ష శక్తిగా దేశవ్యాప్తంగా నిలుస్తుందని, భాజపాను ఓడించి మైనారిటీలకు శక్తినిచ్చే సామర్థ్యం కాంగ్రెస్‌కే ఉందని సాగు మరియు సివిల్‌ సరఫరాల మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు.

  • Bihar Election 2025

    Bihar Elections : బిహార్ లో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీయే – JVC సర్వే

  • Jublihils Campign

    Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిచేది ఆ పార్టీనే – KK సర్వే కీలక రిపోర్ట్

  • Jubli Campgin

    Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో తగ్గేదేలే అంటూ నేతల ప్రచార హోరు

  • Ravi Kishan Bjp

    Ravi Kishan : బీజేపీ ఎంపీ కి చంపేస్తామంటూ వార్నింగ్.!

Latest News

  • PM Modi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు!

  • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

  • Kartik Purnima: రేపే కార్తీక పౌర్ణ‌మి.. ఏ రాశి వారు ఎలాంటి వ‌స్తువులు దానం చేయాలో తెలుసా?

  • Suryakumar Yadav: సూర్య‌కుమార్‌, హారిస్ రౌఫ్‌కు షాకిచ్చిన ఐసీసీ!

  • SIR : SIRకు వ్యతిరేకంగా బెంగాల్లో భారీ ర్యాలీ

Trending News

    • India Post Payments Bank: ఇక‌పై ఇంటి నుండే ఆ సర్టిఫికేట్ పొందవచ్చు!

    • Rs 2,000 Notes: మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా రూ. 2 వేల నోట్లు!?

    • Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

    • Road Accident : ఆర్టీసీ ప్రయాణానికి కూడా రక్షణ కరువేనా…? గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు !!

    • Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd