Kolkata Doctor Rape: ట్రైనీ డాక్టర్ హత్యకు వ్యతిరేకంగా బీజేపీ క్యాండిల్ మార్చ్
మహిళా వైద్యులపై అకృత్యాలకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్రీయ మహిళా మోర్చా ఆగస్టు 16న క్యాండిల్ మార్చ్ చేపట్టనుంది.ఈ విషయంలో తక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది.
- By Praveen Aluthuru Published Date - 07:15 AM, Fri - 16 August 24

Kolkata Doctor Rape: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా డాక్టర్‌పై అత్యాచారం మరియు హత్యకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ మహిళా మోర్చా ఆగస్టు 16 సాయంత్రం అన్ని జిల్లాల్లో క్యాండిల్ మార్చ్ చేపట్టాలని నిర్ణయించింది.
రాష్ట్రీయ మహిళా మోర్చా విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో ఈ విషాద సంఘటనపై క్యాండిల్ మార్చ్ ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నది. బెంగాల్‌లో తాజాగా జరిగిన ఘటన మహిళల భద్రత పరిస్థితిని హైలైట్ చేస్తుంది. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ మహిళా మోర్చా డిమాండ్ చేసింది. ఈ ఘటనకు నిరసనగా రాష్ట్రీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ నేతృత్వంలో మహిళా మోర్చా జాతీయ అధికారి, రాజ్యసభ ఎంపీ దర్శన్ సింగ్, సంగీత యాదవ్, గీతా శక్య, ఇందు బాల గోస్వామి, పశ్చిమ బెంగాల్ ఇన్‌ఛార్జ్ పూజా కపిల్ మిశ్రా సాయంత్రం 6 గంటలకు ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ వెలుపల మార్చ్‌ను చేపట్టనున్నారు.
అంతకుముందు ఆగస్టు 15న పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ గురువారం మధ్యాహ్నం ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు చేరుకున్నారు. అక్కడ జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు నిరసనగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులతో మాట్లాడి నిరసన తెలుపుతున్న వైద్యులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Shravana Masam : ‘శ్రావణ’ సోమవారాల్లో ఈ దానాలు చేస్తే శుభ ఫలితాలు