News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄India News
  • ⁄Bjp Govt Hero In Publicity We Were Zero As Cong Failed To Publicise Its Work Azad

Ghulam Nabi Comments: బీజేపీ హీరో, కాంగ్రెస్ జీరో!

భార‌తీయ జ‌న‌తాపార్టీ ఒక హీరో అంటూ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గులాంన‌బీ ఆజాద్ ప్ర‌శంసిస్తూ ప‌రోక్షంగా మోడీ స‌ర్కార్ ను ఎత్తిపొడిచారు.

  • By CS Rao Updated On - 01:06 PM, Thu - 5 May 22
Ghulam Nabi Comments: బీజేపీ హీరో, కాంగ్రెస్ జీరో!

భార‌తీయ జ‌న‌తాపార్టీ ఒక హీరో అంటూ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గులాంన‌బీ ఆజాద్ ప్ర‌శంసిస్తూ ప‌రోక్షంగా మోడీ స‌ర్కార్ ను ఎత్తిపొడిచారు . గోరంత చేసి కొండంత ప్ర‌చారం చేసుకోవ‌డంలో ఆ పార్టీ తిరుగులేని హీరోగా చెలామ‌ణి అవుతుంద‌ని ప‌రోక్షంగా వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. మ‌హా రాష్ట్ర మాజీ సీఎం ఫ‌డ్న‌విస్ వేదిక‌పై ఉండ‌గానే అలాంటి అస్త్రాన్ని బీజేపీపై ఆజాద్ చాక‌చక్యంగా వ్యంగ్యాన్ని పండించారు. దేశానికి ఎంతో చేసిన‌ప్ప‌టికీ ప్ర‌చారం చేసుకోవ‌డంలో కాంగ్రెస్ పార్టీ జీరో గా మారింద‌ని అన్నారు. ప‌బ్లిసిటీ చేసుకోవ‌డంలో బీజేపీ హీరోకాగా, కాంగ్రెస్ జీరో అంటూ త‌న‌దైన శైలిలో ఆజాద్ ప్ర‌స్తుత ఎన్టీయే ప్ర‌భుత్వానికి చుర‌క‌లు వేశారు. లోక్‌మత్ టైమ్స్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్‌కేర్ అవార్డ్స్ – 2021లో కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న ఆరోగ్య‌శాఖ మంత్రిగా ఎంతో చేయాల‌ని అనుకున్నార‌ని అన్నారు.

ఆనాడు మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌భుత్వంలో కావాల‌ని ఆరోగ్య‌శాఖ మంత్రిత్వ‌శాఖ‌ను తీసుకున్న విష‌యాన్ని గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, కేంద్ర ఆరోగ్య మంత్రిగా అనేక ఆవిష్కరణలు , కొత్త ఆలోచనలను అమలు చేసిన విష‌యాన్ని అవ‌లోకించారు. దేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రాథమిక నమూనా మార్పును తీసుకువచ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు. వైద్య కళాశాలల నిర్మాణానికి, వైద్య బోధనా అధ్యాపకుల వయస్సును పెంచడంలో పెద్ద మార్పుల‌ను చేప‌ట్టామ‌ని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్యం, విద్యను మెరుగుపరచడం అవ‌స‌ర‌మ‌ని ఆజాద్ అన్నారు. భారతీయ వైద్యులకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు ల‌భిస్తోన్న విష‌యాన్ని ఆజాద్ వెల్ల‌డించారు. ఆజాద్ చేతుల మీదుగా ‘కోవిడ్ మహమ్మారి సమయంలో సమాజానికి అత్యుత్తమ సేవ’ విభాగంలో ‘ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్‌కేర్ అవార్డ్ 2021స‌ని ఫడ్నవీస్ మరియు మహారాష్ట్ర ఇంధన మంత్రి నితిన్ రౌత్ అందుకున్నారు.

Tags  

  • BJP politics
  • Congress lost
  • delhi
  • gulam nabi azad

Related News

Kiran Kumar Reddy: ఏపీసీసీ అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ రెడ్డి?

Kiran Kumar Reddy: ఏపీసీసీ అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ రెడ్డి?

కాంగ్రెస్ అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని దేశ రాజధాని ఢిల్లీకి పిలిపించింది.

  • Delhi’s Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 26 మంది సజీవ దహనం

    Delhi’s Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 26 మంది సజీవ దహనం

  • Liquor Home Delivery: ఇంటికే ‘మద్యం’ డెలివరీ!

    Liquor Home Delivery: ఇంటికే ‘మద్యం’ డెలివరీ!

  • Delhi Govt: ఢిల్లీ మెట్రో, ఆస్ప‌త్రుల‌కు ప‌వ‌ర్ క‌ట్‌

    Delhi Govt: ఢిల్లీ మెట్రో, ఆస్ప‌త్రుల‌కు ప‌వ‌ర్ క‌ట్‌

  • Delhi Crime : ఢిల్లీ వెళ్తున్నారా జాగ్ర‌త్త‌.. రోడ్డుమీద క‌నిపిస్తే లాక్కెళుతున్నారు. షాకింగ్ రిపోర్ట్ ఇదే!

    Delhi Crime : ఢిల్లీ వెళ్తున్నారా జాగ్ర‌త్త‌.. రోడ్డుమీద క‌నిపిస్తే లాక్కెళుతున్నారు. షాకింగ్ రిపోర్ట్ ఇదే!

Latest News

  • Deepika Padukone:15 ఏళ్ల క్రితం నన్నెవరూ నమ్మలేదు.. దీపికా ఎమోషనల్!

  • Whats App : వాట్సాప్ గ్రూప్స్ లో మరో రెండు కొత్త ఫీచర్లు

  • Kinnera Moguliah : `ప‌ద్మ‌శ్రీ` వాప‌స్ కు కిన్నెర మొగుల‌య్య `సై`

  • Solar Power : రాత్రి వేళ `సోలార్ ప‌వ‌ర్` ఉత్ప‌త్తి

  • Nallala Odelu: టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి నల్లాల ఓదెలు!

Trending

    • Solar Pole: సూర్యుడి ధృవపు మిస్టరీ గుట్టురట్టు.. ఫోటోలు,వీడియోలు పంపిన సోలార్ ఆర్బిటర్

    • Crocodile Attack: రాజస్థాన్ లో షాకింగ్ ఘటన…నదిలో స్నానం చేస్తున్న వ్యక్తి మొసలి దాడి..!

    • Swami Nithyananda: నిత్యానందకు ఏమైంది? నిర్వికల్ప సమాధి అంటే ఏంటి?

    • Youngest Organ Donor: ఆరేళ్ల బాలిక అవయవదానం..ఎయిమ్స్ హిస్టరీలోనే తొలిసారి…అసలేం జరిగింది..!!

    • Viral Video : ఒకే బ్లాక్ బోర్డుపై..ఏక కాలంలో హిందీ, ఉర్దూ క్లాస్ లు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: