BJP New Chiefs: బీహార్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షులు మార్పు
భారతీయ జనతా పార్టీ బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల పేర్లను ప్రకటించింది. దీంతో పాటు ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇన్‌ఛార్జ్‌ల పేర్లను కూడా ప్రకటించారు.
- By Praveen Aluthuru Published Date - 08:56 AM, Fri - 26 July 24

BJP New Chiefs: ఇటీవల జరిగిన లోకసభలో అనుకున్న ఫిగర్ రాకపోవడంతో బీజేపీ ప్రక్షాళనకు సిద్ధమైంది. 400 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ 300 సీట్లను కూడా దక్కించుకోలేదు. దీంతో ఆ పార్టీ విధానాలపై ఎంత వ్యతిరేకత ఉందొ స్పష్టమైంది. దీంతో మోడీ, అమిత్ షా బీజేపీ బలోపేతంపై దృష్టి పెట్టారు. రానున్న అసెంబీలో ఎన్నికల్లో బీజేపీ గట్టిపోటీ దారుగా నిలవాలంటే పార్టీలో ప్రక్షాళన దప్పదని భావించి ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను మార్చడం జరిగింది.
తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. ఈ ఏడాది జరిగిన లోకసభ ఎన్నికల్లో 8 పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకుంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లోనూ బీజేపీ సత్తా చాటింది. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల పేర్లను ప్రకటించింది. దీంతో పాటు ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇన్‌ఛార్జ్‌ల పేర్లను కూడా ప్రకటించారు.
సామ్రాట్ చౌదరి స్థానంలో బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యుడు డాక్టర్ దిలీప్ జైస్వాల్ నియమితులైనట్లు జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సంతకం చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా రాజ్యసభ ఎంపీ మదన్ రాథోడ్‌ను సీపీగా నియమించారు. జోషి స్థానంలో రాజస్థాన్ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించారు. ఎంపీ రాధామోహన్ దాస్ అగర్వాల్‌ను రాజస్థాన్ ఇన్‌ఛార్జ్‌గా, విజయ రహత్కర్‌ను కో-ఇన్‌చార్జ్‌గా నియమించారు.(BJP New Chiefs)
త్రిపుర ఇన్‌ఛార్జ్‌గా డాక్టర్ రాజ్‌దీప్ రాయ్, అస్సాం ఇన్‌ఛార్జ్‌గా హరీష్ ద్వివేది నియమితులయ్యారు. పార్టీ ఎంపీ అతుల్ గార్గ్ చండీగఢ్‌కు, అరవింద్ మీనన్ తమిళనాడు, లక్షద్వీప్‌లకు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తారు.నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయి.
Also Read: Ferrari SF90 Stradale: రూ. 9 కోట్లతో కొత్త కారు కొన్న స్టార్ హీరో.. ప్రత్యేకతలివే..!