Nawazuddin Siddiqui: బీజేపీ ఆకర్ష్.. అమిత్ షా తో నవాజుద్దీన్ సిద్దిఖీ భేటీ
ప్రముఖ బాలీవుడ్ నటుడు Nawazuddin Siddiqui కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
- Author : Balu J
Date : 27-12-2022 - 12:27 IST
Published By : Hashtagu Telugu Desk
బీజేపీ (BJP) అధిష్టానం స్టార్ క్యాంపెనింగ్ కు తెరలేపుతోంది. ఆకర్ష్ ఆపరేషన్ లో భాగంగా బీజేపీ కీలక నేతలు ప్రముఖ హీరోలతో భేటీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సినీ గ్లామర్ ను ప్రచారానికి ఉపయోగించుకునేలా పావులు కదుపుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలు చిరంజీవి, ఎన్టీఆర్, నితిన్ లాంటి హీరోలతో భేటీ అయ్యారు. తాజాగా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah)ను కలిశారు.
ఈ సమావేశాన్ని మర్యాదపూర్వక భేటీగా హోం మంత్రిత్వ శాఖ అధికారులు అభివర్ణించారు. ఇటీవలే సిద్ధిఖీ (Nawazuddin Siddiqui) ఐసిసిఆర్ చీఫ్ వినయ్ సహస్రబుద్ధే, గోవా సిఎం ప్రమోద్ సావంత్‌ను కూడా కలిశారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ అనురాగ్ కశ్యప్ క్రైమ్-డ్రామా ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’లో తన పాత్రతో పాపులర్ అయ్యాడు. నవాజ్ బాలీవుడ్ పలు విభిన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్.
Also Read : NBK and PSPK: వీర సింహా రెడ్డితో ‘వీరమల్లు’.. ఫ్యాన్స్ కు పూనకాలే!