Bihar : బీహార్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరనపై దద్దరిల్లిన బీహార్ అసెంబ్లీ
Bihar : బీహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఇటీవల చేపట్టిన ఓటర్ సర్వే (SIR)పై విపక్షాల ఆందోళనలు ఊపందుకున్నాయి.
- By Kavya Krishna Published Date - 01:55 PM, Wed - 23 July 25

Bihar : బీహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఇటీవల చేపట్టిన ఓటర్ సర్వే (SIR)పై విపక్షాల ఆందోళనలు ఊపందుకున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజే ఈ అంశంపై ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. సభలు ప్రారంభమైన వెంటనే గందరగోళం చెలరేగింది. పది నిమిషాలు కూడా సజావుగా సభ కొనసాగలేదు. వాయిదాల పర్వం వరుసగా కొనసాగుతూనే ఉంది. ఇదే అంశంపై బీహార్ అసెంబ్లీలోనూ వేడెక్కిన చర్చలు జరిగాయి.
Crime News : సూర్యాపేటలో దారుణం.. ఎమోజీ రిప్లైకి దారుణ హత్య
విపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం అధికార ఎన్డీఏ కూటమికి అనుకూలంగా సర్వే నిర్వహించిందని ఆరోపించారు. “ఎన్నికల సంఘం అధికార పార్టీ తొత్తుగా మారింది” అని తేజస్వి మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై సీఎం నితీష్ కుమార్ తీవ్రంగా ప్రతిస్పందించారు. “నీ వయసెంత? నీ అనుభవం ఎంత? నీ తండ్రి, నీ తల్లి సీఎంగా ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా?” అంటూ తేజస్వి యాదవ్‌పై నితీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార-ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు ప్రయాణించాయి.
తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఓటర్ సర్వే చేపట్టి 52 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించింది. వీరిలో చాలామంది తాత్కాలికంగా రాష్ట్రం బయట ఉన్నారని, ఫేక్ లేదా డుప్లికేట్ ఓటర్లు ఉన్నారని EC పేర్కొంది. కానీ ఈ నిర్ణయం బీహార్‌లో పెద్ద వివాదానికి దారితీసింది. విపక్షాలు ఎన్నికల సంఘం చర్యలు అధికార ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపిస్తుండగా, అధికార వర్గాలు ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను ముమ్మరం చేస్తున్నాయి. ఈసీ చర్యలు విపక్షాలను మరింత కదిలించాయి. రాబోయే రోజుల్లో పార్లమెంట్, అసెంబ్లీ వేదికలపై ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది.
Sleeping Amenia : స్లీపింగ్ అమ్నియాతో బాధపడుతున్నారా? దీని లక్షణాలు మీలో ఉన్నాయా? చెక్ చేసుకోండి