InkInsight : బీహార్ లో మరోసారి ఎన్డీయేనే.. తాజా సర్వే రిపోర్ట్..
InkInsight : బీహార్ రాష్ట్ర రాజకీయ రంగస్థలం ఇప్పుడు హీటెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, రాజకీయం కుదిపేసే ఎత్తులు, ఎన్నికల ప్రచార రణనీతులు, అంచనాలు.. అన్నీ కలగలిసి ఒక ఆసక్తికర రాజకీ యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది.
- By Kavya Krishna Published Date - 03:22 PM, Mon - 7 July 25

InkInsight : బీహార్ రాష్ట్ర రాజకీయ రంగస్థలం ఇప్పుడు హీటెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, రాజకీయం కుదిపేసే ఎత్తులు, ఎన్నికల ప్రచార రణనీతులు, అంచనాలు.. అన్నీ కలగలిసి ఒక ఆసక్తికర రాజకీ యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తుందా? అన్న ఉత్కంఠ మధ్య, పార్టీలు మాత్రం ప్రచార యంత్రాన్ని ఇప్పటికే వేగంగా ఆరంభించాయి.
ఈసారి ఎన్నికలు కేవలం ఓట్ల పందెం మాత్రమే కాదు… గద్దెకు వెళ్లే దారిలో ‘తేజస్వి vs నితీష్’ పోరుగా మారుతోంది. మున్ముందు ఎవరు బీహార్ ముఖ్యమంత్రి అవుతారు? అనే ప్రశ్న ప్రస్తుతం రాజకీయంగా అత్యంత హాట్ టాపిక్. ఇందులో తాజాగా విడుదలైన ఓ అభిప్రాయ సర్వే కొత్త వింతలను బయటపెట్టింది.
సర్వే చెబుతున్నదేమిటి?
ఇంక్ ఇన్‌సైట్ సంస్థ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం, బీహార్ ప్రజలు మళ్లీ ఎన్డీఏ కూటమికే పట్టం కడుతున్నట్లే కనిపిస్తోంది. సర్వే ఫలితాల ప్రకారం.. ఎన్డీఏ కూటమికి 48.9% ప్రజలు మద్దతు ఇస్తున్నారని వెల్లడైంది. అంటే బీజేపీ, జేడీయూ, ఇతర మిత్రపక్షాలు కలసి మరోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే, ఆసక్తికర విషయం ఏమిటంటే.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాత్రం ప్రజలు తేజస్వి యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నారు. సర్వే ప్రకారం 38.3% మంది తేజస్విని సీఎంగా చూడాలనుకుంటున్నారు, అయితే నితీష్ కుమార్‌కు మద్దతు ఇచ్చింది కేవలం 35.6% మంది మాత్రమే.
మరిన్ని వివరాల్లోకి వెళితే.. మహాఘటబంధన్ (ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు) కు 35.8% ఓటు శాతం ఉందని సర్వే చెబుతోంది. తేజస్వి, ప్రధానంగా యువత, ముస్లింలు, షెడ్యూల్డ్ తెగల మద్దతును గట్టిగా సంపాదించుకున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు, నితీష్ నేతృత్వంలోని ఎన్డీఏకి మహిళలు, ఇతర సామాజిక వర్గాలు మద్దతిస్తున్నట్లు సర్వే అంచనా వేసింది.
యువతే కీ రోల్
ఈసారి బీహార్ ఎన్నికల్లో 90% పైగా ఓటింగ్ ప్రభావం యువత నుంచే వచ్చే అవకాశముంది. నూతన ఓటర్లు, విద్యార్థులు, ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువత – వీరిలో ఎవరి పక్షంలో గాలి వీస్తుందనేది ఎన్నికల ఫలితాల్ని శాసించే అంశం. ఈ నేపథ్యంలో పార్టీలు అన్నీ యువతనే టార్గెట్ చేస్తూ హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఉపాధి, ఉచిత ల్యాప్‌టాప్‌లు, స్కాలర్‌షిప్‌లు, యువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహక పథకాలు.. ఇవన్నీ ఎన్నికల ప్రచారంలో హాట్ టాపిక్స్ అయ్యాయి.
మరి ప్రశాంత్ కిషోర్?
తేజస్వి, నితీష్ పోరులో మరొక కీలక పాత్రధారి ప్రశాంత్ కిషోర్ కూడా పటిష్టంగా నిలవాలనుకుంటున్నాడు. కేవలం 2.3% మంది మాత్రమే ఆయనను సీఎంగా కోరుకున్నా, యువతలో ఆయన ప్రసార శక్తి ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చిరాగ్ పాశ్వాన్ కు 4.6% మద్దతు ఉంది.
తాజా పరిస్థితి ఏమిటంటే…
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకుగాను నవంబర్-డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్నట్లు ఊహిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడి పెరిగింది. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, సామాజిక వర్గాల లెక్కలు అన్నీ పార్టీలను బిజీగా మార్చేశాయి.
అంతిమంగా చెప్పాలంటే.. ఈసారి బీహార్ ఎన్నికల్లో పోటీ కఠినంగా మారనుంది. ఓ వైపు తేజస్వి యువత ఆకర్షణగా ఎదుగుతుండగా, మరోవైపు ఎన్డీఏకి ఉన్న బలమైన కూటమి ఆధిక్యం మళ్లీ అధికారం తెచ్చేలా కనిపిస్తోంది. ఏ పార్టీ నాయకత్వం అగ్రస్థానంలో నిలుస్తుందో చూడాలంటే మాత్రం ఎన్నికల వేళ వచ్చేదాకా వేచి చూడాల్సిందే..!
Kingdom : ‘రౌడీ’ ఫ్యాన్స్ రావాలమ్మ.. ఈరోజే రిలీజ్ డేట్ పై క్లారిటీ..!