Muda Case : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట..
ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు ఇతరులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని లోకాయుక్త పోలీసులు ప్రకటించారు.
- By Latha Suma Published Date - 05:48 PM, Wed - 19 February 25

Muda Case : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ముడా కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు లోకాయుక్త పూర్తి క్లీన్‌చిట్ ఇచ్చింది. ముడా కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంగా ప్రకటించింది. ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు ఇతరులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని లోకాయుక్త పోలీసులు ప్రకటించారు.
Read Also: KCR : హరీష్ రావు చేతికి కీలక బాధ్యతలు
కాగా, మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) భూముల కేటాయింపు వివాదంలో, విలువైన భూములు సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి లభించేలా ఆయన కుట్ర పన్నారని ఆరోపణలు వచ్చాయి. సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ ఈ ఆరోపణలపై అభ్యర్థన సమర్పించారు. ఈ నేపథ్యంలో,కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ ముఖ్యమంత్రి పై విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది.
భూ కేటాయింపుల్లో దాదాపు రూ.45కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం కలిగించినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య, కుమారుడు ఎస్ యతీంద్రతో సహా పలువురు సీనియర్ ముడా అధికారులు అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఆ భూమిని అభివృద్ధి చేసేందుకు ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూర్‌లో కీలకమైన విజయనగర్‌లో 38,238 చదరపు అడుగుల ప్లాట్లను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింద ఇచ్చిన ప్లాట్ల మార్కెట్ విలువ కేసరేలో స్వాధీనం చేసుకున్న భూమి విలువకంటే ఎక్కువగా ఉంటుందని బీజేపీ ఆరోపించింది.
Read Also: PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుదల తేదీ ఖరారు