HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Before The Trade Talks With America Trumps Close Aide Peter Navarro Made A Big Statement

Peter Navarro: భారత్-అమెరికా వాణిజ్య వివాదంపై ట్రంప్ సలహాదారు సంచలన వ్యాఖ్యలు!

అమెరికా టారిఫ్‌లు పెంచిన తర్వాత ఇరు దేశాల సంబంధాలలో ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే ట్రంప్ ప్రధానమంత్రి మోదీని 'గొప్ప ప్రధాని' అని ప్రశంసించడంతో కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది.

  • By Gopichand Published Date - 07:36 PM, Mon - 15 September 25
  • daily-hunt
Peter Navarro
Peter Navarro

Peter Navarro: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో (Peter Navarro) మరోసారి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా మధ్య మంగళవారం వాణిజ్య చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నవారో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “భారత్ చర్చల టేబుల్ వద్దకు వస్తోంది” అని అన్నారు. రాయిటర్స్ వార్తా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. గతంలో ఆయన మాట్లాడుతూ, భారత్ చర్చలకు రాకపోతే పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉండవని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు వాణిజ్య చర్చలకు ముందు ఉద్రిక్తతను పెంచాయి.

మరో 25% టారిఫ్‌లు విధించనున్న అమెరికా

అమెరికా భారతీయ ఉత్పత్తులపై అదనంగా 25% టారిఫ్‌లు విధించాలని యోచిస్తున్న తరుణంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఆగస్టులో భారత్ ఎగుమతులు గత తొమ్మిది నెలల్లో కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఇప్పటికే అమెరికా భారత్ నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై టారిఫ్‌లను 50%కి పెంచింది. ఈ నేపథ్యంలో, ఆగస్టులో వాయిదా పడిన ఇరు దేశాల మధ్య ఆరో దశ చర్చలు మంగళవారం జరగనున్నాయి. ఈ చర్చల కోసం అమెరికా సీనియర్ అధికారి బ్రెండన్ లించ్ ఢిల్లీకి చేరుకున్నారు.

Also Read: AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో సిట్ మెమో.. ఏసీబీ కోర్టులో విచారణకు రంగం సిద్ధం

నవారో తీవ్ర ఆరోపణలు

పీటర్ నవారో గతంలో కూడా భారతదేశంపై అనేక తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా మార్కెట్‌పై భారత్ అధిక టారిఫ్‌లు విధించి, అన్యాయంగా లబ్ధి పొందుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి భారత్ యుద్ధాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన వాదించారు. భారత్‌ను ‘టారిఫ్‌ల మహారాజా’ అని సంబోధించి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ‘మోదీ యుద్ధం’ అని వ్యాఖ్యానించి వివాదాస్పదంగా మారారు.

సంబంధాలలో ఒడిదుడుకులు

అమెరికా టారిఫ్‌లు పెంచిన తర్వాత ఇరు దేశాల సంబంధాలలో ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే ట్రంప్ ప్రధానమంత్రి మోదీని ‘గొప్ప ప్రధాని’ అని ప్రశంసించడంతో కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది. దీనిపై మోదీ స్పందిస్తూ ట్రంప్ భావనను అభినందించారు. అమెరికాతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సందేశం ఇచ్చారు. ఈ వివాదం ఇప్పుడు జరుగుతున్న చర్చలతో ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • India US Trade Deal
  • Navarro On India
  • Peter Navarro
  • Trump Tariff
  • world news

Related News

Donald Trump

Trump 3rd Time : ట్రంప్ మూడోసారి కోరిక నెరవేరుతుందా..?

Trump 3rd Time : ప్రస్తుతం రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవిలో ఉన్న ట్రంప్, భవిష్యత్తులో కూడా మరోసారి పోటీ చేయాలనే ఆలోచన ఉందన్న సంకేతాలు ఇచ్చారు

  • Donald Trump

    Donald Trump: కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు.. సాక్ష్యంగా ట్రంప్!

  • Earthquake Today

    Earthquake Today: వ‌ణికించిన భూకంపం.. ఈ దేశాల్లో భారీ ప్ర‌కంప‌న‌లు!

  • Sirikit

    Sirikit: థాయిలాండ్ మాజీ రాణి సిరికిత్‌ మృతి!

  • Indian Companies

    Indian Companies: భార‌త‌దేశానికి షాక్‌.. మూడు చ‌మురు కంపెనీల‌పై ఆంక్ష‌లు!

Latest News

  • Fake News : ఫేక్ ప్రచారం పై సైబర్‌క్రైమ్‌ పోలీసులకు టీ కాంగ్రెస్ ఫిర్యాదు

  • Good News to Farmers : రైతులకు కేంద్రం శుభవార్త

  • Indian Refineries : అమెరికా ఎఫెక్ట్? ..రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు నిలిపివేసిన భారత్.!

  • Taskin Ahmed : సిక్సర్ బాదిన బంగ్లాదేశ్ ప్లేయర్.. అవుట్ ఇచ్చిన అంపైర్.. ఒక్కసారిగా షాక్!

  • Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!

Trending News

    • Madugula Halwa : ఫస్ట్ నైట్ కోసం స్పెషల్‌గా తయారు చేసే మాడుగుల హల్వా ..ఎలా చేస్తారో తెలుసా ?

    • Shreyas Iyer In ICU: శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐసీయూలో ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది?

    • Cyclone Montha : మాన్సూన్ తుపాను ప్రభావం పై చంద్రబాబు నాయుడు ట్వీట్: ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు చేపట్టాం.!

    • Andhra pradesh : ఏపీ ప్రజలకు మొంథా తుపాన్ అలర్ట్.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!

    • Justice Surya Kant : హరియాణా నుంచి భారత్‌లో తొలి ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్.!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd