Banarasi Sarees : రామమందిరం థీమ్‌తో బనారసీ చీరలు.. ఆ మూవీ ప్రతీ టికెట్‌పై రూ.5 రామమందిరానికి
Banarasi Sarees : ‘బనారసీ చీరలు’ ఎంత ఫేమసో వేరేగా చెప్పాల్సిన అవసరం ఉండదు.
- By Pasha Published Date - 07:36 AM, Mon - 8 January 24

Banarasi Sarees : ‘బనారసీ చీరలు’ ఎంత ఫేమసో వేరేగా చెప్పాల్సిన అవసరం ఉండదు. జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభం కానుండటంతో బనారసీ చీరలకు ఒక్కసారిగా ఆర్డర్లు పెరిగాయి. ఎందుకు అనుకుంటున్నారా ? రాముడి బాల్యం నుంచి రావణసంహారం దాకా అన్ని ముఖ్యమైన ఘట్టాలను కొంగులపై ప్రింట్ చేసి బనారసీ చీరలను రెడీ ఆయాలంటూ చేనేత కార్మికులకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. చీరల అంచులపై శ్రీరామ నామాలు ఉండేలా చూడాలని ఆర్డర్లు ఇచ్చేవారు కోరుతున్నారు. ఇలాంటి ఒక్కో చీర ధర సగటున రూ.7 వేల నుంచి రూ.లక్ష దాకా పలుకుతోందట. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈవిధమైన చీరల తయారీకి తమకు ఆర్డర్లు వస్తున్నాయని వారణాసిలోని ముబారక్‌పుర్ ప్రాంతానికి చెందిన చేనేత కార్మికుడు అనిసుర్ రెహమాన్ చెప్పారు. జనవరి 22న ఇలాంటి చీరలను ధరించి తమ తమ ప్రాంతాల్లో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవాల్లో పాల్గొనాలని మహిళలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. బనారసీ చీర పల్లూపై ‘రామ్‌దర్బార్’ ఫొటో ఉండాలంటూ తమకు అమెరికా నుంచి రెండు ఆర్డర్లు వచ్చాయని మరో చేనేత కార్మికుడు మదన్ వెల్లడించారు. ఈవిధమైన ఆర్డర్లతో వారణాసిలో ‘బనారసీ చీరలు’ నేసే చేనేత కార్మికులకు(Banarasi Sarees) చేతి నిండా పని దొరుకుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
‘హను-మాన్’ ప్రతీ టికెట్‌పై రూ.5 అయోధ్య రామమందిరానికి..
అయోధ్య రామమందిర నిర్మాణం అనేది చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని, జనవరి 22న కుటుంబసభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్తానని వెల్లడించారు. రామమందిర ప్రారంభోత్సవం వేళ ‘హను-మాన్’ చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రతి టికెట్‌పై రూ.5 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామని ప్రకటించింది. మూవీ యూనిట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చిరంజీవి ప్రకటించారు.‘‘ఈ ఈవెంట్‌కు రావడానికి కొన్ని కారణాలున్నాయి. నా ఆరాధ్య దైవం, అమ్మానాన్నల తర్వాత అనుక్షణం ప్రార్థించే వ్యక్తి ఆంజనేయస్వామి. ఆయనను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తీసిన సినిమా ఇది. నేను కొలిచే హనుమంతుడి గురించి బయట ఎక్కడా చెప్పుకోలేదు. ఆయనను పూజిస్తూ క్రమశిక్షణతో, నిబద్ధతతో ఈస్థాయికి వచ్చాను. ఇలాంటి వేదికపై హనుమాన్ గురించి కచ్చితంగా చెప్పాలి. అందుకే ఈ ఈవెంట్‌కు రమ్మని కోరగానే మరో ఆలోచన లేకుండా వచ్చేశా. అయోధ్య రామమందిరానికి మీరు చేస్తున్న సాయం అభినందనీయం’’ అని మూవీ యూనిట్‌కు చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు.