బ్లాస్ట్ అయిన బాలిస్టిక్ క్షిపణి.. దక్షిణ కొరియాలో టెన్షన్ టెన్షన్!
తాజాగా దక్షిణ కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్షను నిర్వహించింది. కాగా ఈ బాలిస్టిక్ క్షిపణి పరీక్షలో దక్షిణ కొరియా
- By Anshu Published Date - 01:52 PM, Wed - 5 October 22

తాజాగా దక్షిణ కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్షను నిర్వహించింది. కాగా ఈ బాలిస్టిక్ క్షిపణి పరీక్షలో దక్షిణ కొరియా విఫలమయ్యింది. ఉత్తర కొరియా మళ్లీ క్షిపణులను ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. దీంతో నిర్వహిస్తున్న క్షిపణి పరీక్షలకు వ్యతిరేకంగా తాజాగా అమెరికా దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. నేపథ్యంలోనే చేపట్టిన బాలిష్టిక్ క్షిపణి పరీక్ష విఫలమైనట్టుగా తెలుస్తోంది.
హ్యున్ మో 2 షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ అదుపుతప్పి ఒక నగరంలో పేలినట్టు సమాచారం. కాగా ఇప్పటికే దక్షిణ కొరియా ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హ్యున్ మో 2 హ్యున్ మో గాంగ్ ను యాంగ్ నగరంలోని ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద ఈ క్షిపణి పేలినట్లు తెలుస్తోంది. అయితే మిస్సెల్ నేల ను తాకిన క్షిపణి భారీగా మంటలు వ్యాపించాయి అని తెలుస్తోంది.
కానీ మిస్సైల్ నేలకూలిన అంశంపై దక్షిణ కొరియా ప్రకటన చేస్తూ ఆ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదు అని వెల్లడించింది. ఈ ఘటనతో ఒక్క సారిగా దక్షిణ కొరియాలోని ప్రజలు భయ బ్రాంతులకు లోనయ్యారు. అంతేకాకుండా ఈ సంఘటనతో దక్షిణ కొరియాలో టెన్షన్ టెన్షన్ మొదలయ్యింది. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతతోంది.