Prakash Ambedkar : ఛాతీనొప్పితో ప్రకాశ్ అంబేద్కర్‌కు అస్వస్థత
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం తన రాజకీయ పార్టీ వీబీఏను సంసిద్ధం చేయడంపై ప్రకాశ్ అంబేద్కర్(Prakash Ambedkar) స్పెషల్ ఫోకస్ పెట్టారు.
- By Pasha Published Date - 12:58 PM, Thu - 31 October 24

Prakash Ambedkar : మహారాష్ట్రకు చెందిన వంచిత్ బహుజన్ అఘాడీ (వీబీఏ) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు 70 ఏళ్ల ప్రకాశ్ అంబేద్కర్ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన ఛాతీనొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన పూణేలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఐసీయూలో ప్రకాశ్‌కు చికిత్స అందిస్తున్నారు. ఆయన గుండెలో బ్లడ్ క్లాట్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆంజియోగ్రఫీ చేస్తామని తెలిపారు. ప్రకాశ్ అంబేద్కర్ మరో మూడు రోజుల పాటు డాక్టర్ల అబ్జర్వేషన్‌లో ఉంటారని వీబీఏ పార్టీ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు రేఖా తాయ్ ఠాకూర్ వెల్లడించారు.
Also Read :North Korea : ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలుంటే.. మాకు ఉత్తర కొరియా ఉంది : రష్యా
ప్రస్తుతం ప్రకాశ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం తన రాజకీయ పార్టీ వీబీఏను సంసిద్ధం చేయడంపై ప్రకాశ్ అంబేద్కర్(Prakash Ambedkar) స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఆయన మార్చి నుంచి మహారాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. విరామం తీసుకోకుండా జనంతో మమేకం అవుతున్నారు. కాగా, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడే ఈ ప్రకాశ్ అంబేద్కర్.
Also Read :Railway Passengers: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రైళ్లలో ఈ వస్తువులు నిషేధం!
శరద్ పవార్‌పై ప్రకాశ్ అంబేద్కర్ సంచలన ఆరోపణలు
ఇటీవలే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్‌పై ప్రకాశ్ అంబేద్కర్ సంచలన ఆరోపణలు చేశారు. 1988 – 1991 మధ్య కాలంలో శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దుబాయ్‌లో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను కలిశారని ఆయన చెప్పారు. ఆ మీటింగ్ సందర్భంగా పవార్‌కు దావూద్ బంగారం గొలుసును గిఫ్టుగా ఇచ్చారని తెలిపారు. తొలుత లండన్‌కు.. అక్కడి నుంచి కాలిఫోర్నియాకు.. అక్కడి నుంచి దుబాయ్‌కు శరద్ పవార్ వెళ్లారని ప్రకాశ్ అంబేద్కర్ పేర్కొన్నారు. ప్రకాశ్ అంబేద్కర్ ఆరోపణలపై ఎన్సీపీ (ఎస్పీ) మండిపడింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి మేలు చేయడానికే ప్రకాశ్ అంబేద్కర్ ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది.